మెగాబ్రదర్ నాగబాబు కూతురు నీహారిక కొణిదెల నటిగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ‘ఒక మనసు’, ‘హ్యాపీ వెడ్డింగ్’, ‘సూర్యకాంతం’ వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. అయితే ఇందులో ఏ సినిమా కూడా సరైన సక్సెస్ అందుకోలేకపోయింది. కానీ నీహారిక నటించిన వెబ్ సిరీస్ లకు మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ బ్యూటీ సినిమాలను పక్కన పెట్టి పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయింది. గుంటూరు ఐజీ జె.ప్రభాకర్ రావు తనయుడు జొన్నలగడ్డ వెంకట చైతన్యతో నిహారిక పెళ్లి డిసెంబర్ 9న రాత్రి 7 గంటల 15 నిమిషాలకు జరగనున్న సంగతి తెలిసిందే.
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఈ వివాహం జరగనుంది. ఇటీవలే నీహారిక పెళ్లి కార్డు కూడా బయటకొచ్చింది. ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ మొత్తం హాజరు కానుంది. అలానే కొందరు స్నేహితులు, సన్నిహితులు పెళ్లి వేడుకకు హాజరుకానున్నారు. ఆ తరువాత డిసెంబర్ 11న హైదరాబాద్ లో రిసెప్షన్ ను ఏర్పాటు చేయనున్నారు. నిహారిక పెళ్లికూతురు ఫంక్షన్ పిక్స్ ను మీరు కూడా ఓ లుక్కెయ్యండి :