‘సైరా’ చిత్రంలో నిహారిక పాత్ర..?

మెగాస్టార్ చిరంజీవి ‘కం బ్యాక్’ మూవీ అయిన ‘ఖైది నెం 150’ చిత్రం ఎండింగ్ లో ఒక్క పవన్ కళ్యాణ్ తప్ప దాదాపు అందరు మెగా హీరోలు కనిపిస్తారు. నిజానికి ఈ చిత్రంలో భాగం కావాల‌ని అందరు మెగా హీరోలు భావించారట. అయితే అది కుదర్లేదు. ఒక్క పాటలో రాంచరణ్ అలా ఒక్కసారి కనిపించి.. రెండు స్టెప్పులేసి వెళ్ళిపోతాడు. అయితే ఆ సినిమాలో ప్రత్యేక పాత్రలో రాంచరణ్ కనిపించడు. అయితే `సైరా`చిత్రంలో మాత్రం ఆ ఛాన్స్ మెగా డాటర్ నిహారిక కొట్టేసిందట.

వివరాల్లోకి వెళితే… చిరంజీవి డ్రీం ప్రాజెక్ట్ అయిన ‘సైరా నరసింహ రెడ్డి’ చిత్రంలో నిహారిక ఓ కీల‌క పాత్రలో కనిపించబోతుందట. నిహారిక ఈ చిత్రంలో క‌నిపించేది కొద్దిసేపే అయినా… త‌న పాత్ర‌కు చాలా ప్రాముఖ్యత ఉంటుందట. ఇంతకీ ఏమిటా పాత్ర అనేది ఆరా తీస్తే… ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. అదేంటంటే… ఈ చిత్రంలో నిహారిక ఓ గిరిజ‌న యువ‌తిగా క‌నిపింస్తుందట. బ్రిటీష్ సైన్యం పై దాడి చేస్తున్న సమయంలో ‘సైరా’ గాయపడతాడు. ఆ సందర్భంలో నిహారిక `సైరా`ని కాపాడుతుందట. ఈ సీన్ చాలా బాగా వచ్చిందట. తన పెద్దనాన్న చిత్రంలో నిహారిక చేసిన ఒక్క సీన్ అయినా… తను కనిపించే సీన్ కి విజిల్స్ పడటం ఖాయమని టాక్ వినిపిస్తుంది. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాత రాంచరణ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus