Niharika: ఆ ఫోటోలను షేర్ చేసిన నిహారిక… తెరపైకి మరోసారి విడాకుల వార్తలు!

మెగా డాక్టర్ నిహారిక పెద్ద ఎత్తున తన వ్యక్తిగత కారణాల వల్ల వార్తలలో నిలుస్తున్న విషయం మనకు తెలిసిందే. నిహారిక 2020 సంవత్సరంలో జొన్నలగడ్డ వెంకట చైతన్య అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న నిహారిక ప్రస్తుతం తన భర్తతో విడాకులు తీసుకోబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల కొన్ని వీరిద్దరూ సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడం అలాగే పెళ్లి ఫోటోలను కూడా డిలీట్ చేయడం జరిగింది. ఇలా వీరిద్దరూ గత కొద్దిరోజులుగా దూరంగా ఉండటంతో విడాకులు తీసుకోబోతున్నారని అందరూ భావిస్తున్నారు.

ఇలా నీహారిక విడాకుల గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ విషయం గురించి మెగా ఫ్యామిలీ ఏ విధంగాను స్పందించలేదు.అయితే నిహారిక మాత్రం ఈ విషయాలను ఏమాత్రం పట్టించుకోకుండా తన పనులను తాను చేసుకుంటూ వెళుతుంది. ఇండస్ట్రీ లోకి యాంకర్ గా వచ్చిన నిహారిక అనంతరం హీరోయిన్ గా స్థిర పడ్డారు. ఇక పెళ్లి తర్వాత నటనకు దూరమయి నిర్మాతగా స్థిరపడ్డారు.

ఈ క్రమంలోనే ఈమె పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ను స్థాపించారు. ఈ బ్యానర్ పై ఇదివరకే ఈమె పలు వెబ్ సిరీస్ లను నిర్మించిన నిర్మాతగా మంచి సక్సెస్ అందుకున్నారు. అయితే గత కొద్దిరోజులుగా ఈమె తన ప్రొడక్షన్ హౌస్ కోసం ఒక ఆఫీస్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అయితే తాజాగా ఆఫీస్ కూడా ప్రారంభించినట్టు తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఈమె సోషల్ మీడియాలో షేర్ చేయగా ఇవి కాస్త వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ పూజ కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలలో నిహారిక భర్త వెంకట చైతన్య ఎక్కడ కనిపించలేదు. ఇలా వెంకటచైతన్య ఈ పూజ కార్యక్రమాలకు దూరంగా ఉండటంతో మరోసారి నిహారిక విడాకుల వార్తలు తెరపైకి వచ్చాయి. వీరిద్దరి మధ్య మనస్పర్ధలు ఉన్నాయని అందుకే వెంకట చైతన్య ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు అంటూ పెద్ద ఎత్తున నేటిజన్స్ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వార్తలకు క్లారిటీ రావాలి అంటే మెగా ఫ్యామిలీ స్పందించాల్సి ఉంది.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus