బుల్లితెర యాంకర్ గా, నటిగా నిహారిక ప్రేక్షకుల్లో పాపులారిటీని సొంతం చేసుకున్నారు. పెళ్లికి ముందు పలు సినిమాల్లో, వెబ్ సిరీస్ లలో నటించిన నిహారిక పెళ్లి తర్వాత కూడా నటిగా, నిర్మాతగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. నిహారిక నిర్మించిన ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అనే వెబ్ సిరీస్ ప్రస్తుతం జీ5 యాప్ లో స్ట్రీమింగ్ అవుతుండగా ఈ వెబ్ సిరీస్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.
‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ వెబ్ సిరీస్ లాంఛ్ కు చిరంజీవిని పిలవకపోవడం గురించి నిహారిక స్పందిస్తూ పెదనాన్న చాలా బిజీగా ఉంటారని వెబ్ సిరీస్ లాంఛ్ కు రావాలని పిలిస్తే పెదనాన్న కానీ బాబాయ్ కానీ నో చెప్పరని అయితే వాళ్లను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక పిలవలేదని నిహారిక పేర్కొన్నారు. పెదనాన్నను తాను డాడీ అని పిలుస్తానని అన్నయ్య పెదనాన్నను డాడీ అని పిలవడంతో తనకు కూడా అలాగే అలవాటైందని నిహారిక చెప్పుకొచ్చారు.
ఆహా ఓటీటీ ఉండగా జీ5 యాప్ కు వెబ్ సిరీస్ ఇవ్వడం గురించి నిహారిక స్పందిస్తూ ఆహా ఓటీటీకి ఇస్తే అయినవాళ్లు కాబట్టి ఇచ్చారని అంటారని లేకపోతే ఇతరులకు ఎందుకు ఇచ్చారని అంటారని నిహారిక పేర్కొన్నారు. తాను గతంలో చేసిన వెబ్ సిరీస్ లు జీ5 యాప్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయని ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ కంటెంట్ విషయంలో జీ5 నిర్వాహకుల సూచనలు తీసుకున్నామని అందువల్లే జీ5 వాళ్లకు ఈ వెబ్ సిరీస్ ను ఇచ్చామని నిహారిక చెప్పుకొచ్చారు.
Most Recommended Video
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!