శ్రీశాంత్ తో తన ప్రేమ విషయాన్ని బయటపెట్టిన నికీషా ప‌టేల్‌

మనదేశంలో ఇప్పుడు మీటూ ఉద్యమం కొనసాగుతోంది. హీరోయిన్స్ తనకి జరిగిన లైంగిక వేధింపుల గురించి మనసు విప్పి మాట్లాడుతున్నారు. అందులో భాగంగానే నికీషా ప‌టేల్‌ తన ప్రేమ సంగతిని బయటపెట్టింది. శ్రీశాంత్ తనని ప్రేమించానని చెప్పి మోసం చేసాడని వాపోయింది. కొన్నేళ్ల క్రితం మ్యాచ్‌ ఫిక్సింగ్ ఆరోపణలతో క్రికెట్‌కు దూరమైన శ్రీశాంత్‌… వెంటనే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి విజయం సాధించుకున్నారు. తమిళ, మలయాళ సినిమాలు చేసే సమయంలో భువనేశ్వరి అనే యువతిని శ్రీశాంత్ వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికి ఒక బాబు, ఒక పాప ఉన్నారు. రీసెంట్ గా అతను ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ తన భార్యను ఏడేళ్లుగా ప్రేమించి పెళ్లి చేసుకున్నానని వెల్లడించాడు. ఈ విషయంపై నికీషా చాలా సీరియస్ అయ్యింది.

శ్రీశాంత్‌తో త‌న ప్రేమాయ‌ణం గురించి తొలిసారి బయటపెట్టింది. “వేరే అమ్మాయిని ఏడేళ్ల‌పాటు ప్రేమించి పెళ్లి చేసుకున్నాన‌ని శ్రీశాంత్ చెప్పాడు. నాతో ఏడాదిపాటు స‌హ‌జీవ‌నం చేయ‌డం గురించి ఏమి చెబుతాడు? శ్రీశాంత్‌తో బ్రేక‌ప్ త‌ర్వాత నేను చాలా ప్ర‌శాంతంగా ఉన్నా. అత‌ని నుంచి విడిపోయినందుకు నాకు కొంచెం కూడా బాధ లేదు. అయితే ప్రేమ గురించి అత‌ను చెబుతున్న అబ‌ద్ధాల‌ను స‌హించ‌లేక‌పోతున్నాను” అని నికీషా తన ఆవేదనని బయటికి వెళ్లగక్కింది. మరి నికీషా ఆరోపణలపై శ్రీశాంత్‌ ఏమంటారో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus