మధ్యలో వచ్చిన “శంకరాభరణం” అనే సినిమా ఒక్కటీ లెక్కలో నుంచి తీసేస్తే నిఖిల్ హిట్ పర్సెంట్ ఆల్మోస్ట్ 95% ఉంది. మినిమం గ్యారెంటీ హీరోగా పేరు సంపాదించుకొన్న నిఖిల్ నటించిన తాజా చిత్రం “కిర్రాక్ పార్టీ”. కన్నడలో సూపర్ హిట్ అయిన “కిరిక్ పార్టీ”కి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 16న విడుదలకానుంది. ఈ సందర్భంగా నిఖిల్ మీడియాతో ముచ్చటించాడు. “కిర్రాక్ పార్టీ” సినిమాలో నటించడం పర్సనల్ గానే కాక ప్రొఫెషనల్ గా కూడా ఎందుకు కీలకం అనే విషయాలు పంచుకొన్నాడు. ఆ విశేషాలు మీకోసం..!!
నా కాలేజ్ డేస్ గుర్తొచ్చాయి..
మా ప్రొడ్యూసర్ అనిల్ సుంకరగారు కన్నడలో “కిరిక్ పార్టీ” సినిమా చూసి నాకు చెప్పారు. నాకు కూడా కథ బాగా కనెక్ట్ అయ్యింది. ముఖ్యంగా సినిమా స్టార్ట్ అవ్వడం నుంచి ఎండ్ వరకూ అంతా కాలేజ్ లోనే జరుగుతుంది. అది నాకు బాగా నచ్చింది. ముఖ్యంగా కొన్ని ఎపిసోడ్స్ నాకు నా కాలేజ్ లైఫ్ గుర్తుకు తెచ్చాయి.
“హ్యాపీడేస్” తర్వాత అలాంటి సినిమా రాలేదు..
2007లో వచ్చిన “హ్యాపీడేస్” అనంతరం తెలుగులో కాలేజ్ లవ్ స్టోరీ వచ్చినప్పటికీ.. పూర్తిస్థాయి కాలేజ్ నేపధ్యంలో తెరకెక్కిన చిత్రం మాత్రం “కిర్రాక్ పార్టీ” మాత్రమే. నేను, మా డైరెక్టర్ శరణ్ కొప్పిశెట్టి, మా డైలాగ్ రైటర్ చందు మొండేటి, స్క్రీన్ ప్లే రైటర్ సుధీర్ వర్మ, మా ప్రొడ్యూసర్ అనిల్ సుంకర.. ఇలా అందరూ ఇంజనీరింగ్ స్టూడెంట్సే. అందుకే అందరం ఈ సినిమాకి బాగా కనెక్ట్ అయ్యామ్.
శరణ్ కోసం చేశారు..
ఈ సినిమాకి చందు మొండేటి, సుధీర్ వర్మ లాంటి డైరెక్టర్స్ వర్క్ చేయడం అనేది నిజంగా చాలా లక్కీ. నిజానికి ఇద్దరూ టీంలో ఉండడడంలో నా హ్యాండ్ లేదు. శరణ్ ఇద్దరికీ మోస్ట్ ఫేవరెట్ అసిస్టెంట్ డైరెక్టర్. అందుకే వాళ్ళిద్దరూ ఈ సినిమాలో శరణ్ కోసం ఇన్వాల్వ్ అయ్యారే తప్ప నాకోసం కాదు.
మ్యూజిక్, సంయుక్తని మాత్రం రీప్లే చేయలేం..
“కిరిక్ పార్టీ” సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నప్పుడు మేం ముందుగా తీసుకొన్న నిర్ణయాలు ఏంటంటే… 1) ఇది మ్యూజికల్ ఎంటర్ టైనర్ కాబట్టి సేమ్ మ్యూజిక్ డైరెక్టర్ ను తీసుకోవాలి. 2) ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన సంయుక్త హెగ్డేని రీప్లేస్ చేయకూడదు. ఎందుకంటే.. ఆమె ఎనర్జీ లెవల్స్, డ్యానింగ్ స్కిల్స్ ను ఎవ్వరూ రీప్లేస్ చేయలేరు. అందుకే ఆ రెండిట్నీ మాత్రం మార్చలేదు.
40 నిమిషాలపాటు ట్రిమ్ చేశాం..
ఒర్జినల్ కన్నడ వెర్షన్ సినిమా లెంగ్త్ మూడు గంటలు. తెలుగులో అంత సేపు జనాల్ని కూర్చోబెట్టడం కష్టం. అందుకే దాదాపు 40 నిమిషాల పాటు రన్ టైమ్ ను తగ్గించామ్. మన నేటివిటీకి సూట్ అవ్వవు లేదా సినిమాలో సిచ్యుయేషన్ తో సింక్ అవ్వవు అనుకొన్న సన్నివేశాల్ని తొలగించి, 2.25 గంటల సినిమాగా “కిర్రాక్ పార్టీ”ని మలిచామ్.
అవన్నీ పుకార్లు మాత్రమే..
సినిమా మేకింగ్ టైమ్ లో డైరెక్టర్ శరణ్ కి ప్రొడ్యూసర్ అనిల్ సుంకరకి విబేధాలు వచ్చాయని, కొన్ని సన్నివేశాలకు నేను మాటలు రాశానని వచ్చిన వార్తల్లో వాస్తవం లేదు. శరణ్ బౌండ్ స్క్రిప్ట్ తో షూటింగ్ మొదలెట్టాడు. అనిల్ సుంకర గారు సినిమా మొత్తంలో రెండుసార్లు మాత్రమే షూటింగ్ కి వచ్చారు.
నా కెరీర్ లో ఎక్కువ గ్యాప్ తీసుకొని నటించిన సినిమా ఇదే..
ఇదివరకు ఏడాదికి కనీసం రెండు సినిమాలు రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకొన్న నేను “కిర్రాక్ పార్టీ” విషయంలో మాత్రం కేవలం క్యారెక్టర్ కోసం నా బాడీని రెడీ చేయడం కోసమే 4,5 నెలల టైమ్ తీసుకొన్నాను. ఆ తర్వాత మళ్ళీ బరువు తగ్గడం కోసం ఇంకో నెల పట్టింది. అందుకే “కేశవ” తర్వాత ఆల్మోస్ట్ సంవత్సరం తర్వాత “కిర్రాక్ పార్టీ” రిలీజవుతుంది.
అవన్నీ ఇన్వాల్వ్ మెంట్ కోసం పడిన తిప్పలు..
ఈ సినిమా కన్నడ హీరో రక్షిత్ శెట్టి రైటర్ కూడా అవ్వడం, కథ కోసం దాదాపు ఆరేడు నెలలపాటు డైరెక్టర్ తో స్పెండ్ చేయడం వలన పాత్రలో బాగా లీనమై నటించాడు. అందుకే నేను కూడా స్క్రిప్ట్ వర్క్ మొదలైనప్పట్నుంచి డైరెక్షన్ టీం తో ట్రావెల్ అయ్యాను. ప్రతి సన్నివేశం నాకు తెలుసు, అందుకేనేమో ఈ సినిమాకి నా కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకి ఇచ్చాను.
అందులో రాజకీయాలేమీ లేవు..
సినిమా కోసం ఆల్మోస్ట్ 80,000 ఆడిషన్స్ చేశాం. అందులో కొందరు యూట్యూబర్స్, షార్ట్ ఫిలిమ్ యాక్టర్స్ కూడా ఉండడం జరిగిందే తప్ప.. కావాలని సినిమా కోసం తెలిసిన మొహాలను తీసుకోవడం అనేది మాత్రం జరగలేదు.
షూటింగ్ అయ్యాక కూడా ఫ్లర్ట్ చేసేవాళ్లం..
ఈ సినిమాతో సిమ్రాన్ అనే కొత్త అమ్మాయిని హీరోయిన్ గా పరిచయం చేస్తున్నాం. కన్నడలో రష్మిక మందన పోషించిన పాత్రను సిమ్రాన్ ప్లే చేస్తుంది. సిమ్రాన్ ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు ఆఫ్ ది స్క్రీన్ కూడా చాలా క్యూట్ గా ఉంటుంది. అందుకే ఆమెతో అందరూ తెగ ఫ్లర్ట్ చేసేవాళ్ళు.
ఫిబ్రవరి రిలీజ్ అనుకొన్నామ్ కానీ..
ఫిబ్రవరి 9వ తారీఖున రిలీజ్ చేద్దామని ప్లాన్ చేశాం కానీ.. అప్పటికి మా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ అవ్వలేదు. ఇప్పటికీ బ్యాగ్రౌండ్ స్కోర్ వర్క్ జరుగుతూనే ఉంది. అందుకే మార్చికి రిలీజ్ డేట్ మార్చాం. ఇప్పుడు ప్రొజెక్ట్ ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. థియేటర్స్ స్ట్రైక్ ఇష్యూ కూడా సెటిల్ అయ్యింది. అందుకే మార్చి 16న రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యామ్.
స్టూడెంట్స్ కంగారు పెడుతున్నారు..
ఇంటర్, డిగ్రీ ఎగ్జామ్స్ మార్చి 14 కల్లా పూర్తయిపోతున్నాయి. అందుకే మా సినిమాని మార్చి 16న రిలీజ్ చేద్దామనుకొన్నామ్. కానీ.. ట్విట్టర్, ఫేస్ బుక్ లో స్టూడెంట్స్ అందరూ మార్చి 14న రిలీజ్ చేసేయండి.. మేము వెయిటింగ్ అంటూ తెగ మెసేజులు పెట్టేస్తున్నారు. వాళ్ళ ఎంకరేజ్ మెంట్ చూస్తుంటే సినిమాని నిజంగానే రెండు రోజుల ముందు రిలీజ్ చేయాలని ఉంది.
కనితన్ రీమేక్, కార్తికేయ-2 మరియు రెండు ఇతర ప్రొజెక్ట్స్..
తమిళంలో సూపర్ హిట్ అయిన “కనితన్” సినిమా కాన్సెప్ట్ ను తీసుకొని తెలుగులో ఠాగూర్ మధు గారి నిర్మాణంలో ఒక సినిమా చేస్తున్నాను. శనివారం మొదటి షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత చందు మొండేటితో “కార్తికేయ 2” చేయాలని ఫిక్స్ అయ్యామ్. “కార్తికేయ” ఎక్కడ ఎండ్ అయ్యిందో సరిగ్గా ఆ ఫ్రేమ్ నుంచే “కార్తికేయ 2” మొదలవుతుంది. ఇంకో రెండు ప్రొజెక్ట్స్ సైన్ చేశాను కానీ.. అవి ఇంకా ఎనౌన్స్ మెంట్ స్టేజ్ కి రాలేదు.
– Dheeraj Babu