యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ నటించిన కార్తికేయ 2 సినిమా విడుదల అయ్యి ఎంతో మంచి విజయం అందుకుంది.ఈ సినిమా ఆగస్టు 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుని ఏకంగా 100 కోట్ల క్లబ్ లో చేరింది.ఇలా ఈ సినిమా ఎంతో మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమా చూసిన ఎంతోమంది సినీ రాజకీయ ప్రముఖులు సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఇలా ఈ సినిమా కేవలం సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా నార్త్ ఇండస్ట్రీలో కూడా ఊహించని విధంగా కలెక్షన్లను రాబట్టింది.
ఈ సినిమా దేశవ్యాప్తంగా మంచి హిట్ కావడంతో కార్తికేయకు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంచి గుర్తింపు వచ్చిందని చెప్పాలి. ఇకపోతే ఈ సినిమా మంచి విజయం సాధించడంతో హీరో నిఖిల్ కు వరుస అవకాశాలు వస్తున్నాయని తెలుస్తోంది. ఈ క్రమంలోనే పలువురు నిర్మాతలు నిఖిల్ నీ సంప్రదించి సినిమా కథలను వినిపించగా నిఖిల్ మాత్రం నిర్మాతలకు షాక్ ఇస్తున్నారు. కథ డిమాండ్ బట్టి ఈయన తన రెమ్యూనరేషన్ భారీగా చెప్పడంతో ఒక్కసారిగా నిర్మాతలు షాక్ అవుతున్నారు.
కార్తికేయ సినిమా కోసం నిఖిల్ ఐదు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకోగా ప్రస్తుతం తన సినిమాలకు కథను బట్టి పది నుంచి 12 కోట్ల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇలా ఈయన ఒకేసారి రెండింతలు రెమ్యూనరేషన్ పెంచడంతో నిర్మాతలు షాక్ అవుతున్నారు. ఈ విధంగా నిఖిల్ రెమ్యూనరేషన్ గురించి పెద్ద ఎత్తున వార్తలు రావడంతో పలువురు ఈ విషయంపై స్పందిస్తూ నిఖిల్ బ్రదర్ కాస్త చూసుకోండి..
ఒక్క సినిమా 100 కోట్లు రాబడితేనే మరి ఇలా పెంచేస్తే కష్టం… కాస్త చూసుకోండి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా నిఖిల్ ఈ విధంగా రెమ్యూనరేషన్ పెంచడం మాత్రం నిర్మాతలకు జీర్ణించుకోలేని విషయమని తెలుస్తోంది. మరి రెమ్యూనరేషన్ విషయంలో నిఖిల్ ఇలాగే ఉంటారా లేదంటే రెమ్యూనరేషన్ విషయంలో వెనకడుగు వేస్తారా అనే విషయం తెలియాల్సి ఉంది.