టాలీవుడ్ మిడిల్ రేంజ్ హీరోలలో ఒకరైన నిఖిల్ (Nikhil Siddharth) ఈ మధ్య కాలంలో నటించిన సినిమాలలో స్పై మినహా మిగతా సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచాయి. నిఖిల్ స్క్రిప్ట్ సెలక్షన్ కూడా అదుర్స్ అనేలా ఉందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. నిఖిల్ తన వల్ల ఏదైనా సహాయం అందించే అవకాశం ఉంటే సహాయం చేయడంలో ముందువరసలో ఉంటారని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. కరోనా సమయంలో నిఖిల్ చేసిన సేవా కార్యక్రమాలు అన్నీఇన్నీ కావు.
ఏపీలోని ప్రముఖ ప్రాంతాలలో చీరాల ఒకటి కాగా చీరాలలో గత కొంతకాలంగా ఒక ఆలయం మూసి ఉంది. ఈ ఆలయం మూసి ఉన్న విషయం కొంతమంది ద్వారా నిఖిల్ దృష్టికి వచ్చింది. అయితే నిఖిల్ ఆ ఆలయంను తెరిపించడంతో పాటు ఆ ఆలయం యొక్క నిర్వహణ బాధ్యతలు తీసుకుని వార్తలో నిలిచారు. నిఖిల్ ఆలయాన్ని తెరిపించిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.
గత కొన్నేళ్లుగా మూసి ఉన్న ఆలయాన్ని నిఖిల్ తెరిపించగా గ్రామస్తులు నిఖిల్ పై పూల వర్షం కురిపించడం గమనార్హం. నిఖిల్ నడుస్తున్న దారిలో పూలు వేసి అభిమానులు అభిమానాన్ని చాటుకోవడం జరిగింది. నిఖిల్ రెమ్యునరేషన్ ఒకింత భారీ రేంజ్ లో ఉంది. నిఖిల్ ఇన్ స్టాగ్రామ్ వేదికగా చేసిన పోస్ట్ కు లక్షా 10 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. నిఖిల్ స్వయంభూ (Swayambhu) సినిమాలో వారియర్ గా నటిస్తుండగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
స్వయంభూ సినిమాలో నభా నటేష్ (Nabha Natesh) , సంయుక్త మీనన్ (Samyuktha Menon) హీరోయిన్లుగా నటిస్తున్నారు. నిఖిల్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. నిఖిల్ కు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుండటం హాట్ టాపిక్ అవుతోంది.