ఒక కాన్సెప్ట్ తో సినిమా తీస్తున్నప్పుడు అలాంటి బ్యాక్ గ్రౌండ్ ఉన్న కథతోనే మరో సినిమా వస్తుంటే.. రిలీజ్ డేట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మాత్రం పోలికలు వచ్చేస్తాయి. దాని వలన సినిమా రిజల్ట్ మారిపోతుంది. అక్కినేని అఖిల్ నటించిన ‘ఏజెంట్’ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 28న ఈ సినిమా రిలీజ్ కానుంది. దీనికి సంబంధించిన అధికార ప్రకటన కూడా వచ్చేసింది. పాన్ ఇండియా సినిమా కావడంతో నిర్మాత అనిల్ సుంకర భారీగా ప్లాన్ చేస్తున్నారు.
అయితే ఈ సినిమాకి నిఖిల్ ‘స్పై’ సినిమాకి పోలికలు కనిపిస్తున్నాయి. ఈ రెండూ కూడా గూఢచారి బ్యాక్ డ్రాప్ లో రూపొందినవే. నిఖిల్ సినిమా దాదాపు పూర్తి కావొస్తుంది. తన కెరీర్ లోనే ‘కార్తికేయ2’ సినిమాను మించి భారీ బడ్జెట్ ఈ సినిమాను రూపొందించారు. దీన్ని కూడా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఎందుకైనా మంచిదని ‘స్పై’ సినిమాను ఏప్రిల్ 14న అంటే ‘ఏజెంట్’ సినిమాకి రెండు వారాల ముందే రిలీజ్ చేస్తే సేఫ్ గేమ్ ఆడినట్లు ఉంటుందనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్లు సమాచారం.
సినిమా రేంజ్, బడ్జెట్ రెండూ ఒకటి కాకపోయినప్పటికీ ఆడియన్స్ పోల్చుకుని విషయంలో అలాంటివేవీ ఆలోచించరు. కాబట్టి వీలైనంత రిస్క్ తగ్గించుకోవడం బెటర్. నిఖిల్ కోరుకున్నట్లుగా ముందుగా ఈ సినిమాను రిలీజ్ చేయడం అవుతుందా..? లేదా..? అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ముందైతే షూటింగ్ పూర్తి చేసి వీలైనంత త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ మీద దృష్టి పెట్టాలి.
మరోపక్క ‘ఏజెంట్’ సినిమా దాదాపు పూర్తయినట్లే. దర్శకుడు సురేందర్ రెడ్డి క్లైమాక్స్ కోసం ఎక్కువ సమయం తీసుకున్నారు. శివరాత్రికి సినిమా టీజర్ కూడా వదిలే ఛాన్స్ ఉంది. మొత్తానికి తెలుగులో మళ్లీ స్పై కాన్సెప్ట్ ట్రెండ్ మొదలైంది. అడివి శేష్ అయితే ఇదే కాన్సెప్ట్ తో ‘గూఢచారి’ సినిమా తీసి హిట్ కొట్టారు. మరిప్పుడు నిఖిల్, అఖిల్ లు ఎలాంటి హిట్ అందుకుంటారో చూడాలి!
రైటర్ పద్మభూషణ్ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!
మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!