Nikhil: నిఖిల్ మరో ప్రయత్నం!

టాలీవుడ్ లో యంగ్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నారు నిఖిల్. మొదటి నుంచి కూడా విభిన్నమైన కథలను ఎన్నుకుంటూ కెరీర్ లో ముందుకు సాగుతున్నారు. రీసెంట్ గా ‘కార్తికేయ2′ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమాతో నార్త్ లో కూడా ఫేమస్ అయ్యారు నిఖిల్. దీంతో ఈసారి ఒప్పుకునే సినిమాల విషయంలో చాలా జాగ్రత్త పడుతున్నారు. ఇప్పటికే ’18 పేజెస్’, ‘స్పై’ సినిమాలు అతడి చేతిలో ఉన్నాయి.

అవి కాకుండా ఒక పీరియాడికల్ సినిమాకి ఓకే చేశారు. ‘అర్జున్ సురవరం’ సినిమాను అందించిన ఠాగూర్ మధునే ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఓ వైవిధ్యమైన పీరియాడికల్ ఫాంటసీ కథను నిఖిల్ చెప్పడం దానికి ఆయన ఓకే చెప్పడం జరిగిపోయాయి. ఓ కొత్త దర్శకుడు దీన్ని డైరెక్ట్ చేయనున్నారు. ప్రస్తుతం చేతిలో ఉన్న రెండు సినిమాలు పూర్తవ్వగానే ఈ పీరియాడికల్ సినిమాను పట్టాలెక్కించనున్నారు. ’18 పేజెస్’ ఈ నెలలోనే విడుదల కానుంది.

‘స్పై’ సినిమా ఇంకా సెట్స్ పైనే ఉంది. జనవరి తరువాత తన కొత్త సినిమాను మొదలుపెట్టనున్నారు నిఖిల్. దీన్ని కూడా పలు భాషల్లో నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో తెలుగులో తెరకెక్కుతోన్న సినిమాలన్నీ వేరే భాషల్లో కూడా రిలీజ్ అవుతున్నాయి. పైగా ‘కార్తికేయ2’ సినిమాతో తన మార్కెట్ రేంజ్ పెంచుకున్న నిఖిల్ పాన్ ఇండియా మార్కెట్ పై దృష్టి పెట్టారు.

తన నుంచి నెక్స్ట్ వచ్చే సినిమాలన్నీ పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కానున్నాయి. ఈ పీరియాడికల్ సబ్జెక్ట్ కి లాంగ్వేజ్ పరంగా బారియర్స్ లేనందున అన్ని భాషల్లో రిలీజ్ చేయనున్నారు. అయితే టెక్నికల్ కాస్ట్, స్టార్ కాస్ట్ సెట్ చేయడానికి కాస్త సమయం పడుతుంది.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus