ప్రేమమ్ బాటలోనే ‘కిరిక్ పార్టీ’ రీమేక్
- August 8, 2017 / 01:59 PM ISTByFilmy Focus
మలయాళ సూపర్ హిట్ “ప్రేమమ్”ను అదే పేరుతో తెలుగులో తెలుగులో రీమేక్ చేసినప్పుడు ఒక సాయిపల్లవి మినహా “అనుపమ పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్”లను వారి వారి పాత్రల్లో నటింపజేశారు. సాయిపల్లవి కూడా డాక్టర్ డిగ్రీ కోసం డేట్స్ ఇవ్వలేకపోవడంతో ఆమె స్థానంలో శృతిహాసన్ ను తీసుకున్నారే కానీ.. ఒకవేళ సాయిపల్లవి డేట్స్ దొరికి ఉంటే ఆమెను కూడా ఉంచేసి ఉండేవారు.
ఇప్పుడు మరో సూపర్ హిట్ సినిమా రీమేక్ విషయంలోనూ అదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు. కన్నడ సూపర్ హిట్ సినిమా “కిరిక్ పార్టీ”ని తెలుగులో నిఖిల్ హీరోగా రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. అందుకోసం కన్నడ వెర్షన్ లో హీరోయిన్ గా సంయుక్త హెగ్డేను ఒక హీరోయిన్ గా ఎంపిక చేసుకొన్న చిత్ర బృందం ప్రస్తుతం ఇంకో హీరోయిన్ కోసం వెతుకులాటలో ఉన్నారు. మరో హీరోయిన్ రష్మిక మందన్నాను తెలుగు వెర్షన్ లోనూ తీసుకోవాలనుకొన్నారు, కానీ ఆమె “కిరిక్ పార్టీ” దర్శకుడు రక్షిత్ శెట్టిని పెళ్ళాడి సెటిల్ అయిపోవడంతో అది కుదరలేదు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















