హిట్టు కోసం సీక్వెల్ ని నమ్ముకున్నారు..!

యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం ‘అర్జున్ సురవరం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతున్నాడు. టి.ఎన్.సంతోష్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం మర్చి 29 న విడుదల చేయబోతున్నారని ఇటీవల చిత్ర నిర్మాతలు వెల్లడించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి మంచి స్పందన లభించింది. నిజానికి ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సినప్పటికీ కొన్ని కారణాల వల్ల విడుదల ఆలస్యం అయ్యింది. నిఖిల్ జర్నలిస్ట్ గా కనిపిస్తున్న ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తుంది.

ఇక ఈ చిత్రం తరువాత చందూ మొండేటి తో ఓ చిత్రం చేయడానికి నిఖిల్ రెడీ అవుతున్నాడట. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘కార్తికేయ’ చిత్రానికి సీక్వెల్ గా ఈ చిత్రం ఉంటుందని ఫిలింనగర్ వర్గాల సమాచారం. 2014లో విడుదలైన ‘కార్తికేయ’ చిత్రం మంచి విజయాన్నందుకుంది. స్వతహాగా నిఖిల్… చందూలు మంచి స్నేహితులని ఇండస్ట్రీలో అందరికి తెలిసిన సంగతే. అప్పట్లో ‘కార్తికేయ’ చిత్రానికి సీక్వెల్ చేయాలనుందని హీరో నిఖిల్ చెప్పాడు. అయితే అప్పుడు దర్శకుడు చందూ.. కథను సిద్ధం చేయలేదట. తరువాత ‘ప్రేమమ్’ ‘సవ్య సాచి’ చిత్రాలతో బిజీగా ఉండడం, నిఖిల్ కూడా తన ప్రాజెక్ట్స్ తో బిజీ అయిపోవడం జరిగింది. అయితే.. ఫైనల్ గా చందూ ఇప్పుడు ఫుల్ స్క్రిప్ట్ ను సిద్ధం చేసాడట. త్వరలోనే ఈ చిత్రం ప్రారంభం కాబోతుందని తెలుస్తుంది. మరి ఈ వార్తలో నిజమెంతుందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకూ ఎదురు చూడక తప్పదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus