ఆకట్టుకుంటున్న ‘నిన్నే నిన్నే’ సాంగ్..!

నాగ శౌర్య, మెహ్రీన్ పిర్జాడ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం ‘అశ్వద్ధామ’. ‘ఐరా క్రియేషన్స్’ బ్యానర్ పై ఉష మూల్పూరి నిర్మిస్తోన్న ఈ చిత్రానికి రమణ తేజ దర్శకుడు. జనవరి 31న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఇక ఇప్పటికే విడుదల చేసిన మోషన్ పోస్టర్ తో ఈ చిత్రం థీమ్ ఏంటన్నది చెప్పకనే చెప్పారు. ఓ నగరంలో అంబులెన్సు వ్యాన్ లో కిడ్నప్ లు జరగడం.. ఆ తరువాత అది హీరో వరకూ ఎలా వచ్చింది.. హీరో ఎలా ఆ సమస్యని పరిష్కరించాడు అనేది కథాంశంగా స్పష్టమవుతుంది.

ఇక ఈ చిత్రం ప్రొమోషన్ల జోరుని కూడా పెంచారు చిత్ర యూనిట్ సభ్యులు. ఇందులో భాగంగా ఈరోజు ‘నిన్నే నిన్నే’ అనే లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. శ్రీచరణ్ పాకాల సంగీతంలో రూపొందిన ఈ పాటని అర్మాన్ మాలిక్, యామిని ఘంటశాల పాడారు. రమేష్ వాకచర్ల లిరిక్స్ ను అందించారు. హీరో హీరోయిన్స్ మధ్య రొమాంటిక్ సాంగ్ గా.. సినిమాల ఈ పాట రాబోతుంది అనుకుంట. విన్న వెంటనే ఈ పాట ఆకట్టుకుంటుంది అనడంలో సందేహం లేదు. మొదటి సింగిల్ తోనే సినిమా పై అంచనాలు ఏర్పడేలా చేయడంలో ‘అశ్వద్ధామ’ చిత్ర యూనిట్ సభ్యులు సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. మీరు కూడా ఓ సారి పాటను వినెయ్యండి.


వెంకీ మామ సినిమా రివ్యూ & రేటింగ్!
అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus