‘నిశ్శబ్దం’ ప్రోమో కి అదిరిపోయే రెస్పాన్స్…!

  • December 17, 2019 / 12:12 PM IST

2018 జనవరిలో వచ్చిన ‘భాగమతి’ చిత్రం తర్వాత మరో చిత్రం చేయలేదు మన అనుష్క. మెగాస్టార్ చిరంజీవి 151 వ చిత్రమైన ‘సైరా నరసింహా రెడ్డి’ లో చిన్న పాత్ర మాత్రమే చేసింది. ఇక ఈమె నుండీ రాబోతున్న తాజా చిత్రం ‘నిశ్శబ్దం’. ఈ చిత్రంలో అనుష్క ఓ మూగ అమ్మాయిగా కనిపించబోతుంది. మాధవన్ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఆయన ‘బ్లైండ్’ గా కనిపించబోతున్నాడు. 2020 జనవరి 31న ఈ చిత్రం విడుదల కానుంది. ఇక సంక్రాంతి సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా.. ‘నిశ్శబ్దం’ చిత్రాన్ని ప్రమోట్ చేయాలనే ఉద్దేశానికి అనుష్క అండ్ టీం వచ్చినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా ఓ సాంగ్ ప్రోమో ను తాజాగా విడుదల చేశారు.

గోపిసుందర్ సంగీతంలో రూపొందిన ఈ పాటకి భాస్కర్ భట్ల లిరిక్స్ అందించారు. ఓ మూగ అమ్మాయితో బ్లైండ్ అయిన హీరో తన మనసులో ఉన్న భావాల్ని ఈ పాట ద్వారా తెలుపుతున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ప్రోమో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ పాట కచ్చితంగా ఓ చార్ట్ బస్టర్ అయ్యేలా అనిపిస్తుంది. ఇక ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ ‘కోన ఫిలిం కార్పొరేషన్’ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ, ఇంగ్లిష్ భాషల్లో కూడా ఇక కాలంలో విడుదల చేయబోతున్నారు.


వెంకీ మామ సినిమా రివ్యూ & రేటింగ్!
అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus