‘నిశ్శబ్దం’ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చిన క్రేజీ హీరో..!

అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘నిశ్శబ్దం’ చిత్రం ఈ మధ్యనే అమెజాన్ ప్రైమ్ లో విడుదలయ్యింది.హేమంత్ మధుకర్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం.. నిజానికి ఏప్రిల్ 2న థియేటర్లలో విడుదల కావాల్సినప్పటికీ.. కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ వల్ల విడుదల కాలేదు. ఇక ఎక్కువ రోజులు ఈ చిత్రానికి ఇంట్రెస్టులు చెల్లించడం ఇష్టం లేక నిర్మాతలు ఓటిటిలో విడుదల చేసేసారు. అయినప్పటికీ ఈ చిత్రం ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేదు.

టీజర్, ట్రైలర్లో ఉన్న సస్పెన్స్ సినిమాలో ఏమాత్రం లేదని ప్రేక్షకులు తేల్చేసారు. ఇక అనుష్క పాత్ర అయితే ఆమె అభిమానులను కూడా ఆకట్టుకోలేకపోయిందనే చెప్పాలి. రెండేళ్ల తరువాత ఇలాంటి ప్లాప్ సినిమాతో అనుష్క ప్రేక్షకులను పలకరించిందేంటి అనే కామెంట్స్ కూడా వినిపించాయి. సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. ‘నిశ్శబ్దం’ చిత్రం రిజల్ట్ తరువాత దర్శకుడు హేమంత్ మధుకర్ కు ఏ హీరో అయినా ఛాన్స్ ఇస్తాడా? అనే డిస్కషన్లు కూడా నడిచాయి.

అంతకు ముందు ఈ దర్శకుడు ‘వస్తాడు నా రాజు’ అనే సినిమా తీసాడు. అది కూడా ఫ్లాపే..! అంతేకాదు ‘ఏ ఫ్లాట్’, ‘ముంబై 125 KM’ అనే హిందీ చిత్రాలు కూడా చేసాడు. అవి కూడా ఆకట్టుకోలేదు. ఈ క్రమంలో ఈ దర్శకుడిని నమ్మి హీరోలు ఛాన్స్ ఇస్తారని చెప్పలేము. అయితే ఓ క్రేజీ హీరో ఇతన్ని నమ్మి తరువాతి సినిమా చెయ్యడానికి ఓకే చెప్పాడట. ఆ హీరో మరెవరో కాదు మన మాధవన్. ‘నిశ్శబ్దం’ చిత్రంలో ఇతను కూడా నటించాడు. హేమంత్ పనితనం నచ్చి.. అతనితో సినిమా చెయ్యడానికి ఓకే చెప్పాడట. ఇక్కడ ఇంకో విచిత్రం ఏమిటంటే.. ఆ ప్రాజెక్టుని మాధవనే నిర్మించబోతున్నాడట.

Most Recommended Video

చిన్నపిల్లలుగా మారిపోయిన ‘బిగ్ బాస్4’ కంటెస్టెంట్స్.. ఎలా ఉన్నారో మీరే చూడండి..!
‘సర్జరీ’ చేయించుకున్న హీరోయిన్లు వీళ్ళే!
భీభత్సమైన బ్లాక్ బస్టర్ ఇచ్చిన హీరోలే తరువాత భయంకరమైన డిజాస్టర్లు కూడా ఇచ్చారు…!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus