‘నిశ్శబ్దం’ గా గట్టి ప్రయత్నాలే చేస్తున్నారుగా..!

‘భాగమతి’ చిత్రం తరువాత అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘నిశ్శబ్దం’. ‘కోన ఫిలిం కార్పొరేషన్’ మరియు ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థల పై కోన వెంకట్, టి.జి.విశ్వప్రసాద్ లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించగా హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించాడు. నిజానికి ఏప్రిల్ 2నే థియేటర్లలో విడుదలకావాల్సిన ఈ చిత్రం.. కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ వల్ల థియేటర్లు మూతపడటంతో ఆగిపోయింది. దాంతో ఈ చిత్రాన్ని నేరుగా అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేశారు నిర్మాతలు. అక్టోబర్ 2న ‘నిశ్శబ్దం’ అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది.

అయితే ప్రేక్షకులను మాత్రం ఈ చిత్రం మెప్పించలేదనే చెప్పాలి. అట్టర్ ఫ్లాప్ అంటూ పెదవి విరిచారు ప్రేక్షకులు. అనుష్క ఫ్యాన్స్ అయితే బాగా హర్ట్ అయ్యారనే చెప్పాలి.2 ఏళ్లుగా అనుష్క సినిమా కోసం వెయిట్ చేస్తూ వచ్చిన ఫ్యాన్స్ కు.. ఈ చిత్రంలో అనుష్క పాత్ర కన్నా.. అంజలి, షాలినీ పాండే పాత్రలే ఎక్కువ హైలెట్ అయ్యాయనే కామెంట్స్ వస్తుండడంతో వారు నిరాశ చెందారని తెలుస్తుంది. ఇదిలా ఉండగా.. అమెజాన్ ప్రైమ్ లో ‘నిశ్శబ్దం’ చిత్రాన్ని ఎక్కువ మంది వీక్షించడం లేదట. దాంతో నిర్మాతలు ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ తీస్తున్నట్టు ప్రచారం మొదలుపెట్టారు.

అలా ప్రచారం చేస్తే .. ‘నిశ్శబ్దం’ ను ఎక్కువ మంది చూస్తారు అనేది వారి ప్లాన్ కావచ్చు. ‘నిశ్శబ్దం’ సినిమా ప్రారంభంలో ఓ వుడెన్ హౌస్ లో దెయ్యం ఉన్నట్టు.. చూపిస్తారు. కానీ సినిమా పూర్తయినా దాని పై ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. సరిగ్గా ఆ ఇన్సిడెంట్ ను ఆధారం చేసుకునే ‘నిశ్శబ్దం’ సీక్వెల్ ఉండబోతుందని వినికిడి. ఈ ప్రచారంలో ఎంత వరకూ నిజముందో తెలియాల్సి ఉంది.

Most Recommended Video

‘సర్జరీ’ చేయించుకున్న హీరోయిన్లు వీళ్ళే!
‘బిగ్‌బాస్‌’ స్వాతి దీక్షిత్ గురించి మనకు తెలియని నిజాలు..!
భీభత్సమైన బ్లాక్ బస్టర్ ఇచ్చిన హీరోలే తరువాత భయంకరమైన డిజాస్టర్లు కూడా ఇచ్చారు…!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus