నితిన్ కి జోడీగా శృతి హాసన్..!

‘అఆ’ సినిమా ఫలితంతో నితిన్ కి అదృష్టం, ఆదరణ ఇంకాస్త పెరిగాయని ఒప్పుకోక తప్పదు. ఈ రెండింటితోపాటు ఆదాయం కూడా పెరిగింది. వీటన్నిటికి మూలం నితిన్ తొలిసారి యాభై కోట్ల మార్కెట్ లో కాలుమోపడమే. అటువంటప్పుడు హీరో రెమ్యునరేషన్ పెరగకుండా ఉంటుందా..? దీనిని బలపరిచే విషయం మరోటి కూడా ఉందండోయ్. అదే హీరోయిన్. స్టార్ హీరోయిన్ అన్నాక రెండు కోట్లు సమర్పించుకోవాల్సిందేనన్నది ఉన్నమాటే. అలంటి ఓ స్టార్ హీరోయిన్ నితిన్ కి జంటగా నటించనుందట.నితిన్ తో నటించిన హీరోయిన్లలో ఒకరిద్దరు స్టార్స్ అయ్యారు కానీ స్టార్ హీరోయిన్లతో నితిన్ పెద్దగా నటించింది లేదు.

‘అఆ’లో నటించిన సమంతను, నితిన్ తో నటించిన తొలి స్టార్ హీరోయిన్ గా చెప్పుకోవచ్చు. అలా ఇప్పటివరకు స్టార్ హీరోయిన్లను ప్రేక్షకులలా అగ్ర హీరోల సినిమాల్లోనే చూస్తున్న నితిన్ ఇప్పుడు వారితోనే జతకకట్టాలని ఉత్సాహం కనబరుస్తున్నాడు. నితిన్ హను రాఘవపూడితో ఓ సినిమాకి సంతకం చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం శృతి హాసన్ ను సంప్రదించారట. ‘సింగం 3’ పూర్తి చేసిన శృతి ‘శభాష్ నాయుడు’వాయిదా పడటంతో ఇప్పడు తనకి తొలి హిట్ ఇచ్చిన పవన్ ‘కాటమరాయుడు’లో నటిస్తోంది. దీనికి మించి శృతి ఖాతాలో మరో సినిమా లేదు. అంచేత శృతి ఈ అవకాశాన్ని పట్టుకుంటుందని టాక్. నిన్న సమంత, నేడు శృతి హాసన్.. లతో నితిన్ సినిమాలు చేస్తుండటం గమనించిన కొందరు పవన్ హీరోయిన్లపై కన్నేశాడని గుసగుసలాడుతున్నారు. నిజమేనంటావా నితిన్..?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus