Nithiin, Sreeleela: శ్రీలీల ఎక్స్‌ట్రా ఆర్డినరీ ఉమెన్.. నితిన్ కామెంట్స్ వైరల్!

  • December 5, 2023 / 04:58 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నటువంటి నటి శ్రీ లీల ప్రస్తుతం వరుస సినిమా ఈవెంట్లతోనూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఒకవైపు సినిమా షూటింగ్లలో బిజీగా ఉంటూనే మరోవైపు సినిమా ప్రమోషన్లలో పాల్గొంటూ క్షణం పాటు తీరిక లేకుండా బిజీగా ఉన్నారు. ఇలా వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి శ్రీ లీల త్వరలోనే ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

డైరెక్టర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీ లీల నటించారు. ఈ సినిమా డిసెంబర్ 8వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా తాజాగా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నితిన్ మాట్లాడుతూ శ్రీ లీలా టాలెంట్ మొత్తం బయటపెట్టారు.

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా శ్రీ లీల పేరు మారు మోగిపోతుందని తెలిపారు. వరుస సినిమా షూటింగులో ప్రమోషన్ కార్యక్రమాలు అంటూ ఈమె ఇంత చిన్న వయసులోనే చాలా బిజీగా మారిపోయారు. అయితే ఈ సినిమా షూటింగ్ మొదటి రోజు శ్రీ లీల నా దగ్గరికి వచ్చి తనని తాను పరిచయం చేసుకున్నారు. అయితే ఈమె ఇప్పటివరకు అందరికీ ఒక నటిగాను ఒక డాక్టర్ గా మాత్రమే తెలుసు కానీ తనలో చాలా ఎక్స్ట్రా టాలెంట్స్ ఉన్నాయి అంటూ ఈయన బయట పెట్టారు.

ఈమె నటిగా, డాక్టర్ గా మాత్రమే కాకుండా స్టేట్ లెవెల్ లో స్విమ్మింగ్ పోటీలలో పాల్గొన్నారు. అదేవిధంగా స్టేట్ లెవెల్ లో హాకీ కూడా ఆడారని మరోవైపు కూచిపూడి భరతనాట్యం తనలో ఎన్నో టాలెంట్స్ దాగి ఉన్నాయని ఆ రోజు కనుక నేను ఆపకపోయి ఉంటే ఈమె తనలో ఉన్న టాలెంట్ మొత్తం బయట పెట్టేదని తెలిపారు. ఇక ఈ సినిమాలో నేను ఎక్స్ట్రాడినరీ మ్యాన్ అయితే శ్రీ లీల అసలైన ఎక్స్‌ట్రా ఆర్డినరీ ఉమెన్ అంటూ ఆమెలో ఉన్నటువంటి టాలెంట్ బయట పెట్టడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus