పవన్ కళ్యాణ్ ని అనుసరిస్తున్న నితిన్
- February 10, 2017 / 01:28 PM ISTByFilmy Focus
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే యువ హీరో నితిన్ కి చాలా ఇష్టం. ఆ అభిమానంతోనే పవన్ డైలాగులే కాదు.. ఏకంగా పాటను కూడా తన సినిమాల్లో పెట్టుకొని డ్యాన్సులు చేశారు. తమ హీరో స్టైల్ ని అభిమానులు ఫాలో అయినట్లే.. నితిన్ కూడా తన అభిమాన హీరో వర్కింగ్ స్టైల్ ని అనుసరిస్తున్నారు. ఎలాగంటారా? పవర్ స్టార్ ప్రస్తుతం కాటమరాయుడు సినిమా చేస్తున్నారు. దీని తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి నడవనున్నారు. ఆ తర్వాత తమిళ దర్శకుడు నీశన్ డైరెక్షన్లో మూవీ చేయనున్నారు. ఇలా మూడు చిత్రాలను ఇప్పుడే ఫైనల్ చేశారు. ఇదే బాటలో నితిన్ నడుస్తున్నారు. ప్రస్తుతం నితిన్ “కృష్ణగాడి వీర ప్రేమగాథ” ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఎల్ఐఈ (లై)- లవ్ ఈజ్ ఎండ్‌లెస్’ అనే సినిమా చేస్తున్నారు.
దీని తర్వాత కృష్ణ చైతన్య డైరెక్షన్‌లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తాజాగా మరో చిత్రానికి కూడా నితిన్ పచ్చజెండా చూపారు. ఇంకా డైరక్టర్ ఖరారు కానీ ఈ మూవీని కేకే రాధామోహన్ నిర్మించనున్నారు. పవన్ వరుసగా మూడు సినిమాలకు ఒకే చెప్పారని, నితిన్ కూడా మూడు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఫిల్మ్ నగర్లో టాక్ నడుస్తోంది. మరి నితిన్ కి ఈ విషయం.. తెలుసో.. తెలియదో..!!
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















