Maestro Movie: నితిన్ గుడ్డిగా వెళ్లిపోతున్నాడా?

నితిన్ కెరీర్ మొత్తంలో విజయాల కంటే అపజయాలే ఎక్కువ. ముఖ్యంగా డిజాస్టర్ సినిమాలతో ఒకనొక సమయంలో మళ్ళీ కనిపించాడేమో అనేంతలా టాక్ వచ్చింది. అయినప్పటికీ మనోడు పవర్ స్టార్ అభిమానిగా బాగానే క్లిక్కయ్యాడు. ఇష్క్ సినిమా నుంచి కాస్త రోటీన్ సినిమాలను పక్కనపెట్టి కొత్తగా ట్రై చేసే ప్రయత్నం చేస్తున్నాడు. సాధారణంగా నితిన్ కంటిన్యూగా డిజాస్టర్ ఎదుర్కోవడం అలవాటుగా మారిపోతోంది. గతంలో అఆ హిట్టయిన అనంతరం లై, ఛల్ మోహన్ రంగా,

శ్రీనివాస కళ్యాణం వంటి సినిమాలతో హ్యాట్రిక్ డిజాస్టర్ ఎదుర్కొన్నాడు. ఇక ఆ తరువాత భీష్మాతో సెట్టయ్యడాని అనుకునే లోపే చెక్, రంగ్ దే సినిమాలతో మరోసారి అపజయాలు ఎదుర్కొన్నాడు. ఇక ఇప్పుడు ఎలాగైనా బాలీవుడ్ హిట్ మూవీ అందాదున్ రీమేక్ తో హిట్ కొట్టాలని రెడీ అవుతున్నాడు. మాస్ట్రో అనే ఆ సినిమాను మెర్లపాక గాంధీ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక షూటింగ్ దాదాపు తుది దశకు చేరుకుంది. మరో రెండు వారాలు వర్క్ చేస్తే షూటింగ్ పార్ట్ అయిపోతుందట.

అంతా బాగానే ఉంది గాని చెక్, రంగ్ దే వంటి సినిమాల విషయంలో నితిన్ గుడ్డిగా వెళ్లాడా అనే కామెంట్స్ వస్తున్నాయి. ఆ సినిమాల షూటింగ్స్ చాలా వేగంగా పూర్తయ్యాయి. ఇప్పుడు మాస్ట్రోను కూడా అంతే స్పీడ్ లో ఫినిష్ చేస్తున్నాడు. మరి ఈసారైనా హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.

Most Recommended Video

ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus