Nithiin: మరో ప్రాజెక్టు నుండి నితిన్ ఔట్.. ఏం జరుగుతుంది?
- January 29, 2026 / 12:05 PM ISTByPhani Kumar
నితిన్(Nithiin) టైమ్ ఇప్పుడు అస్సలు బాలేదు. చేసిన ప్రతి సినిమా ఫ్లాప్ అవుతుంది. కోవిడ్ కి ముందు వచ్చిన ‘భీష్మ’ మినహా..నితిన్ కి చెప్పుకోదగ్గ హిట్ ఒక్కటి కూడా లేదు. ‘రంగ్ దే’ కొంత పర్వాలేదు అనిపించినప్పటికీ.. కమర్షియల్ గా అది గట్టెక్కిన ప్రాజెక్టు కాదు. ‘చెక్’ ‘మాచర్ల నియోజకవర్గం’ ‘ఎక్స్ ట్రా’ ‘రాబిన్ హుడ్’ ‘తమ్ముడు’.. ఇలా ఈ మధ్య కాలంలో నితిన్ చేసిన సినిమాలు అన్నీ డిజాస్టర్లే.
Nithiin
పైగా ఇవి మినిమమ్ గ్యారెంటీ సినిమాలే.. బడ్జెట్ పరంగా నితిన్ మార్కెట్ కి మించి కర్చుపెట్టినవే. అయినా నితిన్ కి కలిసి రాలేదు. ఇదిలా ఉంటే.. మరోవైపు నితిన్ చేయాల్సిన సినిమాలు కూడా వేరే హీరోల వద్దకు వెళ్తున్నాయి. వాస్తవానికి బలగం వేణు డైరెక్ట్ చేస్తున్న ‘ఎల్లమ్మ’లో నితిన్ హీరోగా నటించాలి. కానీ నిర్మాత దిల్ రాజు… ఆ ప్రాజెక్టు నుండి నితిన్ ని తప్పించారు. అతని ప్లేస్లో సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ని హీరోగా పెట్టుకున్నారు.

అటు తర్వాత ‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్లో నితిన్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కాలి. కానీ ఆ ప్రాజెక్టు నుండి కూడా నితిన్ తప్పుకున్నాడు. అతని ప్లేస్ లో శర్వానంద్ వచ్చి చేరాడు. శ్రీను వైట్ల ఫామ్లో లేడు కాబట్టి.. నితిన్ తప్పుకోవడం మంచిదే అని అంతా అనుకున్నారు.అయితే ఇప్పుడు మరో ప్రాజెక్టు నుండి కూడా నితిన్ ని తప్పించినట్టు స్పష్టమవుతుంది. విషయంలోకి వెళితే.. నితిన్ హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా రావాలి.
గుర్రపు స్వారీ నేపధ్యంలో ఓ స్పొర్ట్స్ డ్రామాగా ఆ సినిమా రూపొందాలి. కానీ కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టు నుండి కూడా నితిన్ తప్పుకున్నట్టు తెలుస్తుంది.అతని ప్లేస్ లో విజయ్ దేవరకొండని హీరోగా తీసుకున్నట్టు స్పష్టమవుతుంది. సక్సెస్ లేకపోతే హీరోల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ.













