విజయం వెనుక పరుగు అనేది అన్నీ పరిశ్రమాల్లోనూ ఉన్నప్పటికీ.. మన చిత్రసీమలో ఆ పరుగు వేగం ఎక్కువ. అందుకే ఇక్కడ టాలెంట్ ఉన్నా సరైన విజయం లేక ఢీలాపడ్డ దర్శకులు కొందరుంటే.. అవకాశం కోసం వెయిట్ చేయలేక చతికిలపడ్డవారు ఇంకొందరు. అయితే.. తాజాగా ఈ సక్సెస్ స్ట్రీక్ పుణ్యమా అని మాంచి ఫామ్ లోకి వచ్చిన డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు. తీసింది నాలుగు సినిమాలే అయినప్పటికీ.. కమర్షియల్ హిట్ అందుకొన్న సినిమా మాత్రం “గుంటూరు టాకీస్” ఒక్కటే. ఆ తర్వాత రీసెంట్ గా వచ్చిన “గరుడ వేగ”తో కమర్షియల్ హిట్ తోపాటు పాజిటివ్ టాక్ కూడా సొంతం చేసుకొన్నాడు.
దాంతో ఇప్పటివరకూ కొత్త హీరోలు లేదా కెరీర్ ఎండింగ్ లో ఉన్న రాజశేఖర్ లాంటి హీరోలతో సినిమాలు చేసిన ప్రవీణ్ సత్తారు సక్సెస్ సాధించడంతో యంగ్ హీరో నితిన్ ను డైరెక్ట్ చేసే అవకాశం సంపాదించుకొన్నాడు. ఈ విషయాన్ని నితిన్ తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా ప్రకటించాడు. ఈ చిత్రాన్ని శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి నిర్మించనున్నారు. 2018లో రెగ్యులర్ షూట్ స్టార్ట్ అవ్వనున్న ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు త్వరలోనే డైరెక్టర్ ప్రవీణ్ వెల్లడిస్తారు.
ఇకపోతే ప్రవీణ్ ప్రస్తుతం సుధీర్ బాబు హీరోగా పుల్లెల గోపీచంద్ బయోపిక్ ను తెరకెక్కించేందుకు సన్నద్ధమవుతున్నాడు. మరి ఈ సినిమా అయ్యాక నితిన్ సినిమా మొదలెడతాడా లేక ముందే ఉంటుందా అనే విషయం తెలియాల్సి ఉంది.