Robinhood: అలా అయితే నితిన్ సినిమాకి మరింత ఇబ్బంది తప్పదేమో..!

‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్లో రూపొందిన ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule)  డిసెంబర్ 5న రిలీజ్ అయ్యింది. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతుంది. తక్కువ టైంలోనే వెయ్యి కోట్లు కలెక్ట్ చేసి బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించింది. వీకెండ్ తర్వాత టికెట్ రేట్లు తగ్గించడం వల్ల.. తెలుగు రాష్ట్రాల్లో కూడా బుకింగ్స్ బాగున్నాయి. జనవరి మొదటి వారం వరకు ‘పుష్ప 2’ స్ట్రాంగ్ గా రన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Robinhood

దీంతో ‘మైత్రి’ వారు డిసెంబర్ 25న విడుదల కావాల్సిన తమ నెక్స్ట్ మూవీ ‘రాబిన్ హుడ్’ ను వాయిదా వేసే పనుల్లో ఉన్నారని సమాచారం. ఇప్పుడు కనుక ఆ సినిమాని పోస్ట్ పోన్ చేస్తే.. దాదాపు 3 నెలల వరకు మంచి రిలీజ్ డేట్ దొరకడం కష్టం. అలా అని డిసెంబర్ 25న రిలీజ్ చేస్తే ‘పుష్ప 2’ మ్యానియాలో కొట్టుకుపోయే ప్రమాదం కూడా ఉంది.

ఈ క్రమంలో సంక్రాంతికి ‘రాబిన్ హుడ్’ ని (Robinhood) రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనకి మేకర్స్ వచ్చినట్లు తెలుస్తుంది. పోటీగా 3 పెద్ద సినిమాలు వస్తున్నా.. నితిన్ (Nithiin)  సినిమాకి థియేటర్ల ప్రాబ్లమ్ ఉండదు. ఎందుకంటే ‘మైత్రి’ వాళ్ళు ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ కోసం స్లాట్ పెట్టుకున్నారు. వాళ్ళ థియేటర్లు వాళ్ళకి ఉంటాయి. పైగా నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి కూడా డిస్ట్రిబ్యూటర్.

ఆయన తలుచుకుంటే సింగిల్ స్క్రీన్స్ కూడా అవసరమైనన్ని దొరుకుతాయి. అయితే సమస్య ఒక్కటే. అదేంటంటే.. ‘సంక్రాంతికి వచ్చే సినిమాలు మాస్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసేవిగా ఉండాలి. వేరే జోనర్ సినిమాలని ఆ టైంలో చూడరు. ‘రాబిన్ హుడ్’ లో కామెడీతో పాటు సీరియస్ ఎలిమెంట్ కూడా ఉంది. అందుకే నిర్మాతలు సందిగ్ధంలో ఉన్నట్టు ఇన్సైడ్ టాక్. చూడాలి మరి.. ‘రాబిన్ హుడ్’ ఫైనల్ గా ఎప్పుడు వస్తుందో.

మహేష్, బన్నీ ఫ్యాన్స్ కి ఇది పెద్ద పరీక్షే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus