జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు పాన్ ఇండియా హీరో. ఆల్మోస్ట్ రూ.80 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్న హీరో. మరో 5 రోజుల్లో ‘వార్ 2’ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అలాగే ప్రశాంత్ నీల్, త్రివిక్రమ్ వంటి స్టార్ దర్శకులతో సినిమాలు చేయబోతున్నాడు. అయితే కొంచెం గతంలోకి వెళితే.. ఎన్టీఆర్ ఒకానొక టైంలో వరుస ప్లాపులతో సతమతమయ్యాడు.
ముఖ్యంగా ‘శక్తి’ నుండి చూసుకుంటే ‘రభస’ వరకు అతను చేసిన సినిమాలు అన్నీ ఫ్లాప్ అయ్యాయి. వరుస సినిమాలు ఒప్పుకోవడం వల్లనే ఎన్టీఆర్ కు అలా ప్లాపులు పడ్డాయి అనేది అప్పట్లో ఇండస్ట్రీ టాక్. దీంతో కొంచెం స్లో అయ్యాడు. ఒక సినిమా కంప్లీట్ అయ్యాక ఇంకో సినిమా అనే పద్ధతిని మొదలుపెట్టాడు. ఈ క్రమంలో కొన్ని కథలు కూడా రిజెక్ట్ చేయాల్సి వచ్చింది. అందులో ఒకటి ‘శ్రీనివాస కళ్యాణం’.
‘శతమానం భవతి’ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన సతీష్ వేగేశ్న దర్శకత్వం వహించిన సినిమా ఇది. ఆ సినిమా తర్వాత అతను ఎన్టీఆర్ కోసం ‘శ్రీనివాస కళ్యాణం’ అనే కథను డిజైన్ చేసుకున్నాడు. ఎన్టీఆర్ కు కూడా కథ బాగా నచ్చింది. ఆల్మోస్ట్ ఈ కాంబో ఫిక్స్ అని అంతా అనుకున్నారు. కానీ ఎన్టీఆర్ కాల్షీట్స్ ఖాళీగా లేకపోవడం వల్ల.. ప్రాజెక్టు హోల్డ్ లో పడే పరిస్థితి వచ్చింది. ఆ టైంలో నిర్మాత దిల్ రాజు ఈ కథని మిడ్ రేంజ్ హీరోతో చేస్తే బెటర్ అని భావించి నితిన్ తో చేశారు. కథ మంచిదే. కానీ స్క్రీన్ ప్లే లోపం వల్ల సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు.