నితిన్ (Nithin Kumar) హీరోగా హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో ‘లై’ (LIE) అనే యాక్షన్ మూవీ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది చెన్నై బ్యూటీ మేఘా ఆకాష్(Megha Akash) . ఆ తర్వాత నితిన్ తోనే ‘ఛల్ మోహన్ రంగ’ (Chal Mohan Ranga) సినిమాలో కూడా కలిసి నటించింది. తర్వాత శ్రీవిష్ణుతో (Sree Vishnu) ‘రాజ రాజ చోర’ (Raja Raja Chora) , రవితేజతో (Ravi Teja) ‘రావణాసుర’ (Ravanasura) వంటి పెద్ద సినిమాల్లో కూడా చేసింది. ఇందులో ‘రాజ రాజ చోర’ తప్ప అన్నీ ప్లాపులే. అయినప్పటికీ ఈమెకు ‘డియర్ మేఘ’ వంటి చిన్న చితకా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి.
అయినా అవి సక్సెస్ కాలేదు. దీంతో ప్రియుడిని పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చేసింది. మేఘా ఆకాష్ సాయి విష్ణు అనే బిజినెస్ మెన్ ను 2024 సెప్టెంబర్ 15న వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కొద్దిపాటి బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. పెళ్లి తర్వాత మేఘా సినిమాలు తగ్గించింది. పెళ్ళికి ముందు కమిట్ అయిన సినిమాల్లో నటిస్తూ.. మరోపక్క ఫ్యామిలీ లైఫ్ ను కూడా బ్యాలెన్స్ చేస్తుంది.
ఇక ఇప్పుడు సమ్మర్ కావడంతో తన భర్తతో కలిసి వెకేషన్ కి వెళ్ళింది మేఘా. ‘సమ్మర్ మూడ్ ఛేజింగ్ సన్ షైన్’ అంటూ తన భర్తతో కలిసి రొమాన్స్ చేస్తున్న ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోల్లో కొత్త దంపతులు చాలా క్యూట్ గా ఉన్నారు. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.