Nithin: నిజంగానే సినిమాలో మేటర్ ఉందా లేక నితిన్ ఓవర్ కాన్ఫిడెన్సా?

నితిన్ కి (Nithiin)  ఓ మంచి కమర్షియల్ సక్సెస్ దక్కి అయిదేళ్లు అవుతోంది. “భీష్మ”  (Bheeshma)  అనంతరం నితిన్ కి సరైన సక్సెస్ లేదు. మధ్యలో “రంగ్ దే” (Rang De)  ఓ మోస్తరు విజయం సాధించినప్పటికీ.. నితిన్ కి ఒక ప్రాపర్ హిట్ ఇవ్వలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన “మాస్ట్రో (Maestro), మాచర్ల నియోజకవర్గం  (Macherla Niyojakavargam), ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్” (Extra Ordinary Man) సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి. అయితే.. నితిన్ కి ఇది సర్వసాధారణం. ఒక హిట్ కొట్టాడంటే వెంటనే కనీసం మూడునాలుగు ఫ్లాప్స్ పడుతుంటాయి నితిన్ కి, ఈ విషయాన్ని నితిన్ స్వయంగా “రాబిన్ హుడ్” అనౌన్స్మెంట్ వీడియోలో సెల్ఫ్ ట్రోల్ కూడా చేసుకున్నాడు.

Nithin

అయితే.. “రాబిన్ హుడ్” (Robinhood)  విషయంలో మాత్రం నితిన్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మార్చి 28న విడుదలవుతున్న ఈ చిత్రం మార్చ్ 30న తనకు లభించబోయే బిగ్గెస్ట్ బర్త్ డే గిఫ్ట్ అని స్టేట్మెంట్ కూడా ఇచ్చేశాడు. దాంతో ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. ఈమధ్యకాలంలో హీరోలు తమ సినిమాల మీద స్టేట్మెంట్స్ ఇవ్వడం సర్వసాధారణం అయిపోయింది.

అయితే.. నితిన్ (Nithin) ప్రమోషన్స్ విషయంలో మాత్రం మంచి జోరు చూపిస్తున్నాడు. ఇటీవల గోదావరి జిల్లాల్లో పర్యటించి అక్కడి స్టూడెంట్స్ తో కలిసి డ్యాన్సులు కూడా వేశాడు. అయితే.. నితిన్ ది నిజంగా కాన్ఫిడెన్సా లేక ఓవర్ కాన్ఫిడెన్సా అనేది మరో 10 రోజుల్లో తెలిసిపోతుంది అనుకోండి. ఒకవేళ నితిన్ అనుకున్నట్లుగా “రాబిన్ హుడ్”తో హిట్ కొడితే మాత్రం అతని కాన్ఫిడెన్స్ ప్రూవ్ అవుతుంది.

లేకపోతే మాత్రం మేకపోతు గాంభీర్యంగా మిగిలిపోతుంది. సో, నితిన్ ది కాన్ఫిడెన్సా లేక మేకపోతు గాంభీర్యమా అనేది తెలియాలంటే మార్చి 28 వరకు వెయిట్ చేయాల్సిందే. శ్రీలీల (Sreeleela)  హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి వెంకీ కుడుముల దర్శకుడు. మైత్రీ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చారు.

పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన విశ్వక్ సేన్ తండ్రి.. ఏమైందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus