నితిన్ గురించి మీకు తెలియని రీల్ & రియల్ లైఫ్ సీక్రెట్స్!

జయం చిత్రం ద్వారా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టి విజయం అందుకున్ననటుడు నితిన్. దిల్, సై సినిమాల ద్వారా భారీ హిట్ లను అందుకున్నాడు. ఇష్క్, గుండెజారీ గల్లంతయ్యిందే, హార్ట్ ఎటాక్ మూవీలతో లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్నాడు. తాజాగా యువ హీరో, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో చేసిన “అ..ఆ” సినిమా క్లాసిక్ పీస్ గా నిలిచింది. ఈ సందర్భంగా నితిన్ గురించి ఆసక్తికర సంగతులు..

1. నితిన్ స్వస్థలం నిజామాబాద్. అతని హైయర్ స్టడీ హైదరాబాద్ నారాయణగూడలోని రత్న కాలేజీలో సాగింది.

2. నితిన్ తండ్రి ఎన్. సుధాకర్ రెడ్డి ప్రముఖ ఫిలిం డిస్ట్రిబ్యూటర్. నిర్మాత. ఆయన ప్రోత్సాహంతో నితిన్ సినిమాల్లోకి అడుగు పెట్టాడు.

3. జయం చిత్రం అవకాశం వచ్చినప్పుడు నితిన్ చదువుకుంటూ ఉన్నాడు. మేకప్ రూమ్ లోకి అడుగు పెట్టగానే కాలేజీ క్లాస్ రూమ్ కి టాటా చెప్పాడు.

4. జయం సినిమాకు గాను ఫిలిం ఫేర్ అవార్డ్ (సౌత్ ) నుంచి బెస్ట్ మేల్ డబ్ట్ అవార్డ్ ని నితిన్ అందుకున్నాడు.

5. బాలీవుడ్ సినిమా అగ్యాత్ లో కూడా నితిన్ నటించాడు. ఇది తెలుగులో అడవిగా రిలీజ్ అయింది.

6. దక్షిణ భారత క్లాత్ బ్రాండ్ అయిన కాటన్ కింగ్ కు నితిన్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు.

7. నితిన్ లో గాయకుడు కూడా ఉన్నాడు. ఇష్క్ సినిమాలో “లచ్చమ్మ” అనే పాట పాడాడు.

8. తండ్రిలాగా నితిన్ “అఖిల్” మూవీ ద్వారా నిర్మాతగా మారాడు.

9. విక్టరీ సినిమా ద్వారా నితిన్ టాలీవుడ్ సిక్స్ ప్యాక్ హీరోల క్లబ్ లో చేరాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus