నితిన్ తో నిత్యామీనన్ మరోసారి?
- May 8, 2019 / 04:16 PM ISTByFilmy Focus
ప్రస్తుతం మన యూత్ స్టార్ నితిన్ మూడు సినిమాలు చేయబోతున్నాడు. వీటిలో ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల డైరెక్షన్లో చేయబోతున్న ‘భీష్మ’ చిత్రం ముందుగా సెట్స్ పైకి వెళ్తుంది. దీని తరువాత చేయబోయే రెండు ప్రాజెక్టులను కూడా లైన్లో పెట్టేశాడు. వీటికి సంబందించిన పనులు కూడా చక చకా జరిగిపోతున్నాయట. ఇదిలా ఉండగా నిర్మాతగా మారి ఓ వైవిధ్యభరితమైన చిత్రాన్ని నిర్మించడానికి నితిన్ ప్లాన్ చేస్తున్నట్టు తాజా సమాచారం.
- నువ్వు తోపురావ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- జెర్సీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- చిత్రలహరి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
ఇది పూర్తిగా లేడీ ఓరియెంటెడ్ తరహా చిత్రమని తెలుస్తుంది. ఈ చిత్రంలో నిత్యామీనన్ నటించబోతుందని తెలుస్తుంది. విష్వక్సేన్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించడంతో పాటూ ఓ కీలక పాత్ర పోషించబోతున్నట్టు కూడా టాక్ నడుస్తుంది. త్వరలోనే ఈ ప్రాజెక్టు సంబందించిన పూర్తి వివరాలు ప్రకటించనున్నారట. నితిన్, నిత్యామీనన్ కలిసి గతంలో ‘ఇష్క్’ ‘గుండెజారి గల్లంతయ్యిందే’ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. అప్పటి నుండీ వీరిద్దరికి మంచి స్నేహం ఏర్పడింది. అందుకే ఈ ప్రాజెక్టుకి నితిన్.. నిత్యామీనన్ ను ఎంచుకున్నాడని తెలుస్తుంది.













