ఇద్దరు హీరోలు గేమ్స్ తో మెప్పిస్తారా..?

ఫిబ్రవరి 26వ తేదిన థియేటర్స్ లో గేమ్ ఆడేందుకు కుర్రహీరోలు రెడీ అయిపోయారా అంటే నిజమే అంటున్నారు సినీ లవర్స్. ఒక ఫిజికల్ గేమ్ తో కిక్ ఇస్తుంటే, ఇంకొకరు మైండ్ గేమ్ తో మాయ చేస్తున్నాడు. ఇంతకీ ఎవరా కుర్రహీరోలు అనుకుంటున్నారా.. ఒకరు సందీప్ కిషన్ అయితే, ఇంకొకరు నితిన్. ఈ కిషన్ నితిన్ ఇద్దరూ కూడా ఇప్పుడు ఆడియన్స్ తో గేమ్ ఆడేందుకు రెడీ అయిపోయారు. హాకీ నేపథ్యంలో సందీప్ కిషన్ ఎ1 ఎక్స్ ప్రెస్ గా ముందుకు వస్తున్నాడు.

పిబ్రవరి 26వ తేదిన ఈ సినిమా థియేటర్స్ లో సందడి చేయబోతోంది. సినిమా మేకింగ్ చూస్తుంటే సూపర్ హిట్ కొట్టేలాగానే కనిపిస్తున్నాడు. తమిళం, తెలుగు భాషల్లో రిలీజ్ అవుతోంది కాబట్టి మార్కెట్ కూడా జోరుగానే అవుతోంది. సినిమా ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కలక్షన్స్ పరంగా బంపర్ హిట్ అవుతుంది. అంతేకాదు, రీసంట్ గా వచ్చిన ట్రైలర్ ట్రెండింగ్ లో ఉండటం, సినీ లవర్స్ అందర్నీ ఆకట్టుకోవడం అనేది సినిమాకి మంచి ప్లస్ పాయింట్ తెచ్చిపెడుతోంది.

మరోవైపు చెక్ సినిమాతో నితిన్ సత్తా చాటేందుకు రెడీ అయ్యాడు. ఈ సినిమా కూడా ఫిబ్రవరి 26వ తేదిన రాబోతోంది. హెవీ స్టార్ కాస్టింగ్ తో క్రియేటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి చేస్తున్న ఈ ప్రాజెక్ట్ కూడా ఇప్పుడు నెటిడన్స్ ని, సినీ ప్రేమికులని విపరీతంగా ఆకట్టుకుంటోంది. సో, ఈ సినిమాకి కూడా భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి. భీష్మ సినిమా తర్వాత వస్తున్న నితిన్ సినిమా కాబట్టి ఓపెనింగ్ కలక్షన్స్ ని ఢోకా ఉండదు. ఇప్పుడు ఈ రెండు సినిమాలు ఫిబ్రవరిలో హిట్ టాక్ వస్తే తెలుగు ఇండస్ట్రీలో సమ్మర్ లో వచ్చే మరిన్ని సినిమాలకి ఇది మంచి ఫ్లాట్ ఫార్మ్ ని క్రియేట్ చేసినట్లుగా అవుతుంది.

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus