పాన్ ఇండియా బాక్సాఫీసుని తన కటౌట్..తో షేక్ చేస్తున్న హీరో ప్రభాస్ (Prabhas). డార్లింగ్ క్రేజ్ గురించి, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటి ప్రభాస్ (Prabhas) సరసన ఒక్క ఛాన్స్ దక్కించుకోవాలని ఎందరో హీరోయిన్లు కలలు కంటూ ఉంటారు. కానీ ఒక స్టార్ హీరోయిన్ మాత్రం ప్రభాస్ విషయంలో తాను అనుభవించిన మానసిక వేదన గురించి చెప్పి షాకిచ్చింది. ఆ ఒక్క మాట తన కెరీర్‌కే పెద్ద మచ్చగా మిగిలిపోయిందని, ఇప్పటికీ ఆ గాయం పచ్చిగానే ఉందని చెప్పి వాపోయింది ఆ స్టార్ హీరోయిన్.
ఆ హీరోయిన్ మరెవరో కాదు, నిత్యా మీనన్. ‘అలా మొదలైంది’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై, టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయే ఆమె.. కెరీర్ తొలినాళ్లలో ప్రభాస్ గురించి చేసిన ఓ కామెంట్ తన జీవితాన్ని ఎంతలా మార్చేసిందో ఓ సందర్భంలో వివరించింది ఈ బ్యూటీ. విషయంలోకి వెళితే.. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నిత్యా మీనన్ పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో ‘ప్రభాస్ (Prabhas) గురించి మీ అభిప్రాయం ఏంటి?’ యాంకర్ ప్రశ్నించిందట.
ఆ టైంకి నిత్యా మీనన్ కి తెలుగు హీరోల గురించి అవగాహన లేదట. ఇక్కడి సినిమాలు కూడా ఆమె పెద్దగా చూడలేదట. దీంతో ‘ప్రభాస్ (Prabhas) ఎవరో నాకు తెలీదు’ అని చెప్పింది ఈ బ్యూటీ. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఈమెను ఓ రేంజ్లో ట్రోల్ చేసి పడేశారు. ఆ చేదు అనుభవాన్ని నిత్యా ఇంకా మర్చిపోలేదు..’ఆ సంఘటన నన్ను మానసికంగా కుంగదీసింది. నేనేదో పెద్ద తప్పు చేసినట్లు అందరూ నన్ను టార్గెట్ చేశారు. నిజాయితీగా ఉండటం కూడా కొన్నిసార్లు తప్పేనని అప్పుడే నాకు అర్థమైంది.
ఎక్కడ ఎలా మాట్లాడాలో ఆ సంఘటన నాకు నేర్పింది. ఏళ్లు గడిచినా ఆ ఇష్యూ నన్ను ఇంకా వెంటాడుతూనే ఉంది’ అంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పి షాకిచ్చింది. ఆ ఇష్యూ టైంలోనే ప్రభాస్ నిత్యాకి ఫోన్ చేసి తనను తాను పరిచయం చేసుకున్నట్టు కూడా ఆ టైంలో టాక్ నడిచింది.