War2: ‘వార్‌ 2’ ప్రచారం.. హృతిక్‌, తారక్‌ కలిసుంటే ఇబ్బందేంటి? అసలు రీజనేంటి?

ఎన్టీఆర్‌ (Jr NTR) పుట్టిన రోజు సందర్భంగా ‘వార్‌ 2’ (War2) సినిమా టీజర్‌ వచ్చింది గుర్తుందా? ఆ తర్వాత సోషల్‌ మీడియాలో జరిగిన చర్చ, రచ్చ గుర్తుందా? మీకు గుర్తుందో లేదో కానీ సినిమా టీమ్‌కి, తారక్‌ సన్నిహితులకు బాగా గుర్తున్నట్లుంది. అందుకే ‘వార్‌ 2’ సినిమా ప్రచారం విషయంలో ఓ డిఫరెంట్‌ ఆలోచన చేశారు. కొత్త ఆలోచన అని ఎందుకు అనడం లేదు అంటే.. టీమ్‌ చేసిన ఆలోచన వల్ల నష్టమైతే చాలానే ఉంది అనిపిస్తోంది.

War2

‘వార్‌ 2’ సినిమా గురించి హృతిక్‌ రోషన్‌ (Hrithik Roshan), తారక్‌ వేర్వేరుగా ప్రచారం చేస్తారని, అదో కొత్త రకం స్ట్రాటజీ అని టీమ్‌ ఘనంగా ఈ రోజు ప్రకటించింది. ఈ మేరకు యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ కొత్త ప్లాన్స్‌ వేస్తోంది అని కూడా ఆ ప్రెస్‌నోట్‌లో పేర్కొన్నారు. సినిమాకు సంబంధించిన ఏ ఈవెంట్‌లోనూ ఇద్దరూ కలసి కనిపించరు అని చెప్పింది యశ్‌రాజ్‌ టీమ్‌. ‘వార్ 2’ (War2) సినిమాకు ప్రత్యేక ఆకర్షణ ఆ ఇద్దరని, అలాంటిది ఆ ఇద్దరినీ ఒకేసారి చూడాలంటే అది తెరపైనే చూడాలి అని ఓ వాదన తీసుకొచ్చింది.

తారక్‌, హృతిక్‌ని నేరుగా తెరపై చూస్తేనే ఆ కిక్‌ వస్తుంది అని కూడా చెప్పింది. దీంతో బాలీవుడ్‌ గ్రీక్‌ గాడ్‌, యంగ్‌ టైగర్‌ను ఒకేసారి బయట చూద్దామంటే ఛాన్స్‌ లేకుండా చేశారు. దీనికి టీమ్‌ చెప్పిన కారణాలు ఇవైతే.. ఇద్దరూ ఒకేసారి కనిపిస్తే ఆ ఫొటోలు, వీడియోల కింద వచ్చే కామెంట్లు, ట్రోలింగ్‌తో ఇబ్బంది రాకూడదు అని టీమ్‌ అనుకోవడం ఓ కారణం అని అంటున్నారు. టీజర్‌ విషయంలో ఇదే జరిగింది అనేది వారి మాట.

ఒకవేళ వారు చెప్పిందే నిజమైతే.. ప్రచార చిత్రాలు కూడా రిలీజ్‌ చేయకూడదు. అంటే టీజర్‌, ట్రైలర్‌లో కూడా ఇద్దరూ కలసి కనిపించే అవకాశం ఉంది. అక్కడ చూడొచ్చు కానీ లైవ్‌లో చూడకూడదు అంటే ఎలా? అనేదే అభిమానులు, నెటిజన్ల ప్రశ్న. అలాగే ‘ఆర్ఆర్ఆర్‌’ సినిమా రిలీజ్‌ సమయంలో తారక్‌, రామ్‌చరణ్‌ కలసి ప్రచారం చేశారు. దీని వల్ల సినిమాకు చాలా ఉపయోగం కూడా అయింది. మరి అలాంటి అవకాశం లేకుండా యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ ఎందుకు చేసుకుంటోంది అనేదే ఇక్కడ ప్రశ్న. ఈ సినిమా ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘కన్నప్ప’ ఇంకొక్క రోజే ఛాన్స్.. ఏమవుతుందో మరి!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus