జ్యోతిక చేయాల్సిన పాత్రలో నిత్యామీనన్!

సూర్య నటించగా మే 6న విడుదల కానున్న “24”లో సూర్య సరసన సమంత, నిత్యామీనన్ లు కథానాయికలుగా నటించిన విషయం తెలిసిందే. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నిజానికి నిత్యామీనన్ పాత్రకు మొదట జ్యోతికను అనుకొన్నారంట. కానీ.. జ్యోతిక నటించడానికి సుముఖత చూపకపోవడంతో, అప్పుడు ఆమె స్థానంలో నిత్యామీనన్ ను ఎంపిక చేశారట. ఈ విషయాన్ని దర్శకుడు విక్రమ్ కుమార్ ఇటీవల ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పాడు.

అయితే.. పెళ్ళయ్యాక సూర్య-జ్యోతికలు జంటగా నటించనున్న తాజా చిత్రం మే నెలలో ప్రారంభం కానుందని సూర్య ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యులో చెప్పారు. సో, “24” సినిమాలో సూర్య-జ్యోతికల రొమాంటిక్ పెయిర్ ని మిస్ అయినవారందరూ రాబోయే చిత్రంలో వారిద్దరి కెమిస్ట్రీని ఎంజాయ్ చేయవచ్చు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus