అనుష్క, కాజల్, తమన్నా, సమంత.. ఇప్పటి తెలుగు తెరపై టాప్ హీరోయిన్లు. వీరి తర్వాత పది మందికి పైగా కొత్త తారలు టాలీవుడ్ లోకి ప్రవేశించారు. వారిలో రెజీనా, రాశిఖన్నా, రకుల్ ప్రీతీ సింగ్ లు మంచి విజయాలతో చేతినిండా సినిమాలతో నంబర్ వన్ రేస్ లోకి అడుగుపెట్టారు. లేటెస్ట్ గా ఈ జాబితాలోకి సురభి, నివేతా థామస్, అనుపమ పరమేశ్వన్ చేరుతున్నారు. వీరు చేసింది ఒకటి, రెండు సినిమాలే అయినా.. విపరీతమైన ఫాలోయింగ్ సంపాధించారు.
బీరువా చిత్రంతో అడుగుపెట్టిన సురభి ఎక్స్ ప్రెస్ రాజా .. జెంటిల్ మన్ సినిమాలతో హిట్ ట్రాక్ లోకి వచ్చేసింది. ఆ..ఆ లో అనుపమ పరమేశ్వన్ ఎక్కువ మార్కులు కొట్టేసింది. మాస్ మహారాజ్ రవితేజ పక్కన అవకాశం అందుకుంది. ఈ చిత్రం హిట్ పైన ఆమె పయనం ఆధారపడి ఉంది. ఇక నివేతా థామస్, జెంటిల్ మన్ లో నాని తో పోటీపడి పేరుతెచ్చుకుంది. ఒక్క చిత్రం తోనే యువకుల మనసు దోచుకుంది. ఆమె ఇంటి ముందు నిర్మాతలు క్యూ కట్టినా తొందర పడకుండా ఎన్టీఆర్ సరసన నటించేందుకు పచ్చ జెండా ఊపింది. రెండో సినిమా తోనే యంగ్ టైగర్ తో అవకాశం కొట్టేసిందంటే రాబోయే రోజుల్లో రకుల్, రాశీ ఖన్నా, రెజీనాలకు ఈ భామ గట్టి పోటీ ఇవ్వనునట్లు సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.