జెంటిల్ మ్యాన్, నిన్నుకోరి సినిమాలతో నివేతా థామస్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. జై లవకుశ మూవీలో ఎన్టీఆర్ పక్కన నటించి టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ జాబితాలో చేరిపోయింది. అయితే ఇప్పుడు ఆమె ఓ భారీ ఛాన్స్ అందుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు గుప్పు మన్నాయి. శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ చేయనున్న “అమర్ అక్బర్ ఆంటోని” సినిమాలో ఓ హీరోయిన్ గా సెలక్ట్ అయినట్లు ప్రచారం సాగింది. ఈ విషయాన్నీ ఓ అభిమాని ట్విట్టర్ వేదికగా నివేత ని అడగగా ఆమె క్లారిటీ ఇచ్చింది. ఆ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. ఇంతవరకు అటువంటి ఛాన్స్ తన వద్దకు రాలేదని వెల్లడించింది. మలయాళంలో బాగా పాపులర్ అయిన ఈ బ్యూటీ ప్రస్తుతం మంచి కథలను సెలక్ట్ చేసుకునే బిజీలో ఉంది.
ఇక రవితేజ విషయానికి వస్తే.. టచ్ చేసి చూడు సినిమా తర్వాత కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నటిస్తున్నారు. “నేల టికెట్” అని పేరు పరిశీలిస్తున్న ఈ చిత్రం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. దీని తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా గురించి అధికారికంగా ఎవరూ ప్రకటించక ముందే టైటిల్ “అమర్ అక్బర్ ఆంటోనీ” అని, ఇందులో హీరోయిన్స్ గా నివేత, కాజల్ హీరోయిన్స్ గా సెలక్ట్ అయ్యారని, మూడో హీరోయిన్ కోసం వెతుకుతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇందులో నివేత వార్త అబద్ధమని తేలింది. మరి మిగతావి కూడా నిజమా.. గాసిప్పా.. అనేది తెలియాల్సి ఉంది.