“నేను మీకు బాగా కావాల్సిన‌వాడిని” చిత్రం నుండి “నచ్చావ్ అబ్బాయి” పాట విడుదల

యంగ్ సెన్సేషన్ కిరణ్ అబ్బవరం హీరోగా కోడి రామ‌కృష్ణ గారి ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాత‌గా త‌న ప్రొడ‌క్ష‌న్ నెం 1 గా కోడి దివ్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ లో చేస్తున్న సినిమా నేను మీకు బాగా కావాల్సినవాడిని. S R కళ్యాణమండపం లాంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత.. అదే కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. రాజావారి రాణిగారు, ఎస్ఆర్ క‌ళ్యాణ‌మండ‌పం లాంటి సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కిరణ్ అబ్బ‌వ‌రం.. ఇందులో చాలా కొత్తగా కమర్షియల్ గా కనిపిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి “నచ్చావ్ అబ్బాయి” పాట విడుదలైంది.

ఇదివరకే విడుదలైన ఈ సినిమా పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.ఇప్పుడు ఈ చిత్రం నుండి ఒక మాస్ బీట్ ను రిలీజ్ చేసారు. “నచ్చావ్ అబ్బాయి” పాటలో కిరణ్ అబ్బవరం వేసిన స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రానికి మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ అద్బుత‌మైన సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ ఆడియోని ల‌హ‌రి ద్వారా మార్కెట్ లోకి తీసుకు వస్తున్నారు. ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా వస్తోంది. కిర‌ణ్ అబ్బ‌వ‌రం మాస్ లుక్ లో అంద‌ర్ని ఆక‌ట్టుకుంటున్నాడు. ఈ సినిమాకి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus