ఎండలకు భయపడుతున్నారా? ఎన్నికలని ఆలోచిస్తున్నారా? ఇందుకేనా వాయిదాలు!

టాలీవుడ్‌లో అతి పెద్ద సీజన్‌ ఏది అంటే సంక్రాంతి అని అంటారు. ఆ సీజన్‌లో ఓ మోస్తరు సినిమా వచ్చిన మంచి వసూళ్లే అందుకుంటాయి అని అంటుంటారు. ఈ ఏడాది సంక్రాంతి సీజన్‌ మరోసారి ఆ మాట నిజం అని నిరూపించింది. ఆ విషయం పక్కనపెడితే… ఆ తర్వాత అంతటి పెద్ద సీజన్‌ సమ్మర్‌. వేసవిలో సినిమాల రిలీజ్‌ కోసం డేట్స్‌ను చాలా రోజుల ముందే ఖరారు చేసుకుంటూ ఉంటారు సినిమా జనాలు. అయితే ఈ ఏడాది సమ్మర్‌ అనాథగా మారిపోతోందా? పరిస్థితి చూస్తుంటే అలానే అనిపిస్తోంది.

కావాలంటే మీరే చూడండి. ఈ సమ్మర్‌కు పెద్ద హీరోలీ సినిమాలేవీ రావడం లేదు. కుర్ర హీరోల సినిమాలే ఈ సమ్మర్‌లో వరుస కట్టే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో సమ్మర్‌లో బాక్సాఫీసు బోరుమనడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు. దానికి కారణం అల్లు అర్జున్‌, తారక్‌, రామ్‌చరణ్‌ ఆ సీజన్‌ నుండి తప్పుకోవడమే. అంతేకాదు మేలో వస్తాడు అనుకున్న ప్రభాస్‌ కూడా రావడం లేదు అని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దాంతోపాటు కారణాలు కూడా వినిపిస్తున్నాయి.

ఈ ఏడాది వేసవికి భారీ చిత్రాల మోత మోగిపోతుందని అభిమానులు అనుకున్నారు. కానీ రోజులు దగ్గరికొచ్చేసరికి ఒక్కొక్క స్టార్‌ హీరో వెనక్కి వెళ్లిపోతున్నారు. వస్తాడనుకున్న ‘పుష్ప’రాజ్‌ వచ్చేదేలే అంటూ వెనక్కి పోయాడు. ఇక బాక్సాఫీసు లెక్కలు ఛేంజ్‌ చేస్తాడనుకున్న ‘గేమ్‌ ఛేంజర్‌’ డేట్‌ ఛేంజ్‌ చేశాడు. రికార్డుల జాతర చేస్తాడనుకున్న ‘దేవర’ సారీ చెప్పేసి దసరాకు వెళ్లిపోయాడు. ఇక మిగిలింది (Kalki) ‘కల్కి 2898 ఏడీ’.

ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ చెప్పడానికి చేసిన హడావుడి ఆ తర్వాత పెద్దగా కనిపించడం లేదు. దీంతో నిజంగానే మే9న వస్తాడా అనే డౌట్‌ వస్తోంది. ఒకవేళ ‘కల్కి’ కూడా నో చెబితే సమ్మర్‌ సప్పగా మారడం ఖాయం అని చెప్పొచ్చు. ఇప్పటికే రూ. వెయ్యి కోట్ల లిస్ట్‌లో రెండేళ్లుగా మన సినిమాలు లేవు. ఫస్టాఫ్‌లోనే చూద్దాం అనుకుంటే అయ్యేలా లేదు. మరి సెకండాఫ్‌లో అయినా వీళ్లు వచ్చి ఆ ముచ్చట తీరుస్తారేమో చూడాలి.

‘యానిమల్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసింది.. లాభం ఎంత?

ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ .. ల లిస్ట్.!
కోపంతో ఊగిపోయిన మిడ్ రేంజ్ హీరో.. ఏం అయ్యిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus