రాజుగారి సినిమా సోలో రిలీజ్!

  • October 9, 2017 / 10:33 AM IST

ఈమధ్య అగ్ర కథానాయకుల సినిమాలకే పోటీ తప్పడం లేదు. నేనంటే నేను అంటూ తమ సినిమాలను ఒకేరోజు లేదా ఒకవారం గ్యాప్ తో విడుదల చేయడానికి ఉవ్విళ్లూరుతున్నారు. కానీ.. ఈ శుక్రవారం మాత్రం నాగార్జునకు విపరీతంగా అచ్చోచ్చేట్లుంది. ఆయన నటించిన తాజా చిత్రం “రాజుగారి గది 2” గత నెలలోనే విడుదలకావాల్సి ఉన్నప్పటికీ గ్రాఫీక్స్ వర్క్ విషయంలో నాగార్జున సాటిస్ఫై అవ్వకపోవడంతో.. ఔట్ పుట్ కరెక్ట్ గా రెడీ అవ్వడానికి నెల పట్టింది. దాంతో ఈవారం అనగా అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.

“రాజుగారి గది” లాంటి సెన్సేషనల్ హిట్ అనంతరం ఓంకార్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడం, నాగార్జునగారి కోడలు సమంత ఈ చీత్రంలో ముఖ్యపాత్ర పోషిస్తుండడం సినిమాకి ప్రత్యేక ఆకర్షణలు. ప్రీరిలీజ్ బిజినెస్ తోపాటు శాటిలైట్ బిజినెస్ కూడా అయిపోయిన “రాజుగారి గది 2″కు ఈవారం సోలో రిలీజ్ దక్కడంతో మొదటివారం వసూళ్ల విషయంలో నాగార్జున కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. పైగా లాస్ట్ ఫ్రైడే కూడా సరైన తెలుగు సినిమా లేక బోర్ కొట్టిన తెలుగు ప్రేక్షకులు కూడా “రాజుగారి గది 2” కోసం వెయిటింగ్. సో సినిమా ఏమాత్రం బాగున్నా సూపర్ హిట్ అవ్వడం ఖాయం. మరి హైప్ ఎలాగూ ఉంది కాబట్టి.. మిగిలిందంతా కంటెంట్ బట్టి ఉంటుంది. చూద్దాం మరి “రాజుగారి గది 2” జనాలని ఏమేరకు ఆకట్టుకొని.. బాక్సాఫీస్ వద్ద విజృంభిస్తుందో.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus