Jr NTR: ఎన్టీఆర్‌ బర్త్‌డే స్పెషల్‌గా ఒక్కటే

కరోనా పరిస్థితులు కాబట్టి సరిపోయింది కానీ.. లేదంటే ఈ పాటికి ఎన్టీఆర్‌ అభిమానుల సందడి మొదలైపోయేది. పుట్టన రోజు డీపీలని, కొత్త సినిమా అప్‌డేట్‌లు ఏముంటాయని అభిమానులు ఆలోచనలు మొదలెట్టేసేవారు. కానీ పరిస్థితుల కారణంగా అలాంటివి కనిపించడం లేదు. అయితే ఎన్టీఆర్‌ నుండి ఈ ఏడాది బర్త్‌డే స్పెషల్‌గా ఒక్క సినిమా అప్‌డేటే వస్తుందని అంటున్నారు. దీంతో అభిమానులు కాస్త నిరాశచెందారని చెప్పొచ్చు. అయితే వచ్చే ఒక్క అప్‌డేట్‌ అయినా సాలిడ్‌ ఉంటుందట.

ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో సినిమా రద్దు అయిన నేపథ్యంలో కొరటాలతో సినిమా చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. అయితే ఆ తర్వాత సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్‌ లేదు. ఎప్పుడు ప్రారంభిస్తారు, కాస్ట్‌ అండ్‌ క్రూ వివరాలు లాంటివి ఏవీ ప్రకటించలేదు. దీంతో ఎన్టీఆర్‌ జన్మదినం సందర్భంగా ఏవైనా వివరాలు వస్తాయేమో అని ఫ్యాన్స్‌ ఎదురుచూస్తున్నారు. అయితే ఈ పుట్టిన రోజుకు చిత్రబృందం అలాంటి ఆలోచన ఏమీ చేయడం లేదట.

ఇక ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ నుండి ఒక టీజర్‌ అప్‌డేట్‌ ఉంటుందని వార్తలొస్తున్నాయి. అయితే ఇప్పటికే ఎన్టీఆర్‌ క్యారెక్టర్‌ను రివీల్‌ చేస్తూ ఓ టీజర్‌ వచ్చేసింది. మరి ఇప్పుడు ఏం కొత్తగా ఏం ఇస్తారో చూడాలి. లేక చరణ్‌ పుట్టిన రోజుకు ఇచ్చినట్లు నవ్వుతున్న పోస్టర్‌ ఒకటి లాంచ్‌ చేస్తారేమో మరి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో వీడియోను ఎడిట్‌ చేసి, విడుదల చేసే పరిస్థితి కనిపించడం లేదు. కాబట్టి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుండి అయితే పోస్టర్‌ లేదంటే మోషన్‌ పోస్టర్‌ వస్తుంది.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus