బిగ్‌బాస్‌ 4: నోయల్ గేమ్ ఓవర్..?

బిగ్ బాస్ హౌస్ లో పార్టిసిపెంట్స్ 100రోజులకి పైగా ఉంటూనే రకరకాల టాస్క్ లలో పెర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి వాళ్లు ఫిజికల్ గా ఎంతో ఫిట్ గా ఉండాలి. అంతేకాదు, మానసికంగా కూడా చాలా ధృఢంగా ఉండటమే ఈ గేమ్. అయితే, ఈసారి సీజన్ లో అనూహ్యంగా సోషల్ మీడియా ఫేమ్ తో హౌస్ లోకి వెళ్లింది గంగవ్వ. కానీ, ఆమెకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల, బిగ్ బాస్ హౌస్ లో ఇమడలేకపోవడం వల్ల బయటకి వచ్చేసింది. ఇలా రావడానికి కూడా చాలా ఫార్మాలిటీస్ ఉంటాయి. అంతేకాదు, వాళ్లకి ఇచ్చే రెమ్యూనిరేషన్ పైన దీని ప్రభావం అనేది పడుతుంది.అయితే, ఇప్పుడు సింగర్ నోయల్ విషయంలో కూడా ఇదే జరగబోతోందా అనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఎందుకంటే, బిబి డే కేర్ సెంటర్ టాస్క్ జరిగేటపుడు అనూహ్యంగా సిక్ అయ్యాడు నోయల్. తన భుజానికి గాయం పెద్దదిగా అయ్యిందని, అలాగే లెగ్ పెయిన్ కూడా చాలా విపరీతంగా వస్తోందని, తట్టుకోలేకపోతున్నానని గేమ్ లో పార్టిసిపేట్ చేయలేదు. మద్యలోనుంచి నోయల్ గేమ్ ని అభిజిత్ టేక్ ఓవర్ చేశాడు.

అవసరమైన మెడికల్ సహాయాన్ని కూడా అర్దించాడు. దీనికి స్పందించిన బిగ్ బాస్ టీమ్ వెంటనే నోయల్ ని విశ్రాంతి తీస్కోమని చెప్పింది. అయితే కన్ఫెషన్ రూమ్ నుంచి బయటకి వస్తూ నోయల్ టీమ్ తో ఒక మాట అన్నాడు. నేను వెళ్లిపోతానని చెప్పానని కూడా అన్నాడు. దీంతో ఇప్పుడు నోయల్ ఇంటికి వస్తున్నాడు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. అంతేకాదు, ఫస్ట్ రెండు మూడు వారాలు నోయల్ కి ఓట్లు వేసిన ఫ్యాన్స్ ఇప్పుడు గత రెండు మూడు వారాలనుంచి తగ్గిపోయారు కూడా. దీనికి అతని హెల్త్ ఇష్యూనే కారణం అయ్యింది. గంగవ్వని ఇంటికి పంపినట్లుగా తనని కూడా పంపించేయమని అడిగానని , అందుకే నామినేషన్స్ లోకి వచ్చి ఎలిమినేట్ అయిపోయిన పర్లేదు అని అన్నాడు నోయల్. ఈ ఒక్క డైలాగ్ అతని ఓటింగ్ పర్సెంటేజ్ ని తగ్గించేసింది.

ఇక ఈవారం నామినేషన్స్ లో లేడు కాబట్టి సేఫ్ గానే ఉన్నాడు. అయితే, అనూహ్యంగా ఇప్పుడు బిగ్ బాస్ టీమ్ నిర్ణయం తీస్కుంటే మాత్రం ఖచ్చితంగా నోయల్ గేమ్ ఓవర్ అయినట్లే. ఎందుకంటే, టాస్క్ లలో పెర్ఫామెన్స్ లేకుండా నోయల్ ని పైనల్ వరకూ తీస్కుని రావడం అనేది కష్టమే అవుతుంది. అంతేకాదు, స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉంటూనే నోయల్ ఇలా డల్ అయిపోవడం వల్ల ఆడియన్స్ కూడా ఓట్లు వేయడానికి ఇష్టపడరు. సో, బిగ్ బాస్ టీమ్ పంపించినా , పంపించకపోయినా నోయల్ ఈసారి నామినేషన్స్ లోకి వస్తే మాత్రం కష్టమే అనేది బిగ్ బాస్ ప్రేక్షకుల వాదన. అదీ మేటర్.

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus