Kartikeya 2: హిందీలో షోలు పెంచాలంటూ రిక్వెస్ట్ చేసిన అభిమానులు!

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం కార్తికేయ 2. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా పలుమార్లు వాయిదా పడుతూ చివరికి ఆగస్టు 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమా మొదటి షో తోనే హిట్ టాక్ సొంతం చేసుకోవడమే కాకుండా కలెక్షన్ల సునామీ కూడా సృష్టిస్తుందని చెప్పాలి. ఇకపోతే ఈ సినిమా కేవలం సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా నార్త్ ఇండస్ట్రీలో కూడా తన సత్తా ఏంటో నిరూపించుకుంటుంది.

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ సినిమా నార్త్ ఇండస్ట్రీలో కూడా హిందీ వర్షన్ లో విడుదలైన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా కేవలం 50 షో లకు మాత్రమే పరిమితమై హిందీలో విడుదలైంది.మొదటి షో చూసిన అభిమానులు ఈ సినిమాకు మంత్ర ముగ్ధులు కావడంతో కేవలం మౌత్ టాక్ ద్వారా థియేటర్ కి ప్రేక్షకులను రప్పిస్తోంది. ఈ క్రమంలోనే సినిమా టికెట్లు ఎప్పటికప్పుడు బుక్ కావడంతో సినీ ప్రేమికులు హిందీ వర్షన్ లో ఈ సినిమా షో ల సంఖ్య పెంచాలి అంటూ చిత్ర బృందానికి రిక్వెస్ట్ చేశారు.

ఈ విధంగా హిందీ వర్షన్ లోకి కేవలం 50 షోలకు మాత్రమే పరిమితమైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఏకంగా 150 షోలకు పెంచారు.ఇకపోతే ఈ సినిమా ఊహించని స్థాయిలో ఇటు సౌత్ ఇండస్ట్రీలోనూ అటు నార్త్ ఇండస్ట్రీలో కలెక్షన్లను రాబట్టడంతో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. సినిమాని విడుదల చేయడానికి థియేటర్లు దొరకడం లేదంటూ కొందరు కావాలని తన సినిమాని అడ్డుకుంటున్నారని

నిఖిల్ ఈ సినిమా విషయంలో ఎంతో ఆవేదన వ్యక్తం చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా ఎన్నో అవంతరాలను అధిగమించి థియేటర్ లో విడుదలయ్యి కేవలం మూడు రోజుల వ్యవధిలోనే బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాటలో పరుగులు తీస్తోంది.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus