భాగ్య శ్రీ బోర్సే(Bhagyashri Borse).. ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా డిజాస్టర్ అయినప్పటికీ భాగ్య శ్రీకి వరుస ఆఫర్లు వచ్చేలా చేసింది. దర్శకుడు హరీష్ శంకర్.. భాగ్య శ్రీని అంత అందంగా చూపించాడు. వెంటనే ఆమెకు విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ సినిమాలో అవకాశం వచ్చింది. ఆ సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని అందించలేదు. భాగ్య శ్రీకి మంచి ఛాన్సులు వస్తున్నాయి.
కానీ సక్సెస్ అనేది చాలా అవసరం. సక్సెస్ ఉంటేనే.. స్టార్ హీరోలు ఈమెకు ఛాన్సులు ఇస్తారు. ఈ నేపథ్యంలో భాగ్య శ్రీకి నవంబర్ నెల చాలా కీలకంగా మారింది. విషయం ఏంటంటే.. ఈ నెలలో ఆమె నటించిన 2 క్రేజీ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అవే దుల్కర్ సల్మాన్ ‘కాంత’.. రామ్ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’. ఈ 2 సినిమాలు 2 వారాల గ్యాప్లో రిలీజ్ కానున్నాయి. ముందుగా ‘కాంత’ రానుంది. నవంబర్ 14న ఈ సినిమా విడుదల కానుంది.
దుల్కర్ సల్మాన్ హీరోగా రానా దగ్గుబాటి కీలక పాత్రలో తెరకెక్కిన సినిమా ఇది. సినిమా బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ మూవీగా ‘కాంత’ రూపొందింది. ఇందులో కుమారి అనే హీరోయిన్ పాత్రలో భాగ్య శ్రీ బోర్సే కనిపించనుందట. వాస్తవానికి ఆమె హీరోయిన్ గా మొదట సైన్ చేసిన మూవీ ‘కాంత’నే అని చెప్పింది భాగ్య శ్రీ. ఈ సినిమా టీజర్, ట్రైలర్స్ అయితే.. బజ్ క్రియేట్ చేయలేదు. మరి బాక్సాఫీస్ వద్ద ఎలా మెప్పిస్తుందో చూడాలి.
ఇక 2 వారాల గ్యాప్ లో ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ కూడా రిలీజ్ కానుంది. ఇది కూడా సినిమా నేపథ్యంలో సాగే కథే. కాకపోతే అభిమానుల పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. ఈ సినిమా పాటలు, టీజర్ అయితే ప్రేక్షకులను మెప్పించాయి. మరి ఈ సినిమా భాగ్య శ్రీకి ఎంత వరకు కలిసొస్తుందో చూడాలి. ఈ 2 సినిమాల్లో ఒక్కటి హిట్టయినా భాగ్య శ్రీ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లడం ఖాయం.