నవంబర్ నెలలో ప్రేక్షకులను మెప్పించిన ఏకైక సినిమా ఇదే!

ప్రతి సంవత్సరం ఇతర నెలలతో పోల్చి చూస్తే నవంబర్ నెల ఇండస్ట్రీకి అన్ సీజన్ అనే సంగతి తెలిసిందే. నవంబర్ నెలలో విడుదలయ్యే సినిమాలలో ఎక్కువ సినిమాలు ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకోవని ఇండస్ట్రీలో చాలామంది భావిస్తారు. ఈ రీజన్ వల్లే నవంబర్ నెలలో సినిమాలను విడుదల చేయడానికి దర్శకనిర్మాతలు ఆసక్తి చూపరు. ఈ ఏడాది నవంబర్ నెలలో విడుదలైన సినిమాలలో మెజారిటీ సినిమాలు నిరాశపరిచాయి. నవంబర్ నెలలో 30 సినిమాలు విడుదల కాగా మా ఊరి పొలిమేర2 సినిమా మాత్రమే హిట్ గా నిలిచింది.

ఫస్ట్ వీక్ లో కీడాకోలా, కృష్ణఘట్టం, ఘోస్ట్, (Maa Oori Polimera 2) మా ఊరి పొలిమేర2 రిలీజ్ కాగా మా ఊరి పొలిమేర2 మినహా మిగతా సినిమాలు కమర్షియల్ గా నిరాశపరిచాయి. నవంబర్ సెకండ్ వీక్ లో జపాన్, జిగర్తాండా డబుల్ ఎక్స్, టైగర్3 సినిమాలు రిలీజ్ కాగా ఈ మూడు సినిమాలకు క్రిటిక్స్ నుంచి నెగిటివ్ రివ్యూలు వచ్చాయి.

నవంబర్ మూడో వారంలో మంగళవారం రిలీజ్ కాగా ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నా కొన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ కాలేదు. నవంబర్ మూడో వారంలో సప్తసాగరాలు దాటి సైడ్ బి, మై నేమ్ ఈజ్ శృతి, స్పార్క్ లైఫ్ సినిమాలు రిలీజ్ కాగా ఈ సినిమాలు సైతం ప్రేక్షకులకు షాకిచ్చాయి. నాలుగో వారంలో ఆదికేశవ, కోటబొమ్మాళి పీఎస్ విడుదల కాగా ఈ రెండు సినిమాలు కమర్షియల్ గా ఆశించిన ఫలితాలను అందుకోలేదు.

నవంబర్ నెల నిరాశపరిచినా డిసెంబర్ నెలలో విడుదలైన యానిమల్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో చూడాలి. తాజాగా విడుదలైన సలార్ ట్రైలర్ కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. హాయ్ నాన్న, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలపై కూడా అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. ఈ సినిమాలు ఎలాంటి ఫలితాలను అందుకుంటాయో చూడాలి.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus