ముద్దంటే చేదు కాదు కంపరం పుడుతోంది

“మడిసన్నాక కూసింత కళాపోషణ ఉండాలయ్యా..” అని రావుగోపాలరావుగారు ఏదో సరదాగా చెప్పిన మాటను కొందరు కాస్త సీరియస్ గా తీసుకొని తమ టాలెంట్ తో ప్రేక్షకుల్ని మైమరింపజేస్తుంటే.. ఇంకొందరు మాత్రం క్రియేటివిటీ పేరుతో తమ కళాపోషణను ప్రేక్షకుల మీదకు రుద్దడానికి విశ్వప్రయత్నం చేస్తూ వారిని భయపెట్టడమే కాదు వారికి చిరాకు పుట్టిస్తున్నారు కూడా. నిన్నమొన్నటివరకూ డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో ప్రేక్షకుల్ని అలరించిన దర్శకులందరూ.. ఇప్పుడు రా, కల్ట్ సినిమా అంటూ వేరే ప్రపంచంలో విహరిస్తున్నారు. ముఖ్యంగా “అర్జున్ రెడ్డి, ఆర్ ఎక్స్ 100” లాంటి సినిమాలు సూపర్ హిట్స్ అవ్వడంతో.. ఆ సినిమాలు విజయం సాధించడానికి కారణం కంటెంట్ అనే విషయాన్ని పట్టించుకోకుండా.. కేవలం సినిమాలోని హాట్ సెక్స్ సీన్స్ & కిస్సింగ్ సీన్స్ ను మాత్రమే విజయానికి కారణాలుగా భావిస్తున్నారు. ఆ ఆలోచన నుంచి వస్తున్న సినిమానే “రథం”.

ఇదివరకూ సినిమాలో ఎక్కడో కనిపించీ కనిపించనట్లుగా ఉండే ముద్దు సీన్లను ‘ఆర్ ఎక్స్ 100″ సక్సెస్ తర్వాత ట్రైలర్ లోనే చూపించేస్తూ.. మార్కెటింగ్ కోసం వాడుకొంటున్నారు. ఈమధ్య ప్రతి సినిమా ట్రైలర్ లోనూ ముద్దు ఉండడం అనేది కామన్ అయిపోయింది. ఈ ట్రెండ్ ఇలాగే కంటిన్యూ అయితే.. భవిష్యత్ ట్రైలర్లతో మాత్రమే కాదు సినిమాల్లోనూ ముద్దులు తప్ప ఏమీ ఉండవు. ఈ విషయాన్ని భవిష్యత్ దర్శకనిర్మాతలు ఇప్పటికైనా గ్రహిస్తే మంచిది లేదంటే.. ట్రైలర్లు చూసిన జనాలు థియేటర్లకు రావడం కూడా మానేస్తారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus