తండ్రితో కలిసి మూవీ చేయాలనుకుంటున్న కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్

  • December 6, 2016 / 06:59 AM IST

నందమూరి హరికృష్ణ అద్భుత నటుడు. సీతారామరాజు, లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య.. వంటి చిత్రాల్లో అదరగొట్టారు. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. అతనితో మళ్లీ నటింపచేయించాలని కళ్యాణ్ రామ్ భావిస్తున్నారు. అందుకే కొంత కాలంగా కథలను వింటున్నారు. భారీ బడ్జెట్ తో నిర్మించిన యాక్షన్ మూవీ ఇజం ఆశించినంత విజయం సాధించక పోవడంతో ఈ సారి కుటుంబకథా చిత్రంతో రావాలని ప్లాన్ చేస్తున్నారు. ఆ స్టోరీలో తనతో పాటు, తండ్రికి మంచి ప్రయారిటీ ఉండాలని సూచిస్తున్నారు. యువరచయితలు నందమూరి అభిమానులకు నచ్చేలా కథలు రాసుకొని వినిపిస్తున్నారు.

కొంతమంది దర్శకులు కూడా కళ్యాణ్ రామ్ కి స్టోరీలు చెప్పిన్నట్లు సమాచారం. ఇందులో మరో విశేషం ఏమిటంటే.. నాన్న, అన్నయ్య తో కలిసి నటించేందుకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఉత్సాహంగా ఉన్నారంట. చిన్న క్యారక్టర్ అయినా ఫరవాలేదని కళ్యాణ్ రామ్ కి తారక్ చెప్పినట్లు తెలిసింది. వీరి ముగ్గురు కలిసి సినిమా చేస్తే నందమూరి ఫ్యాన్స్ కి పండగే. మరి వారి ముగ్గురిని డైరక్ట్ చేసే అవకాశం ఎవరికీ వరిస్తుందో కొన్ని రోజుల్లో తెలియనుంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus