ఎన్టీఆర్ , చరణన్న … ఇద్దరూ నాలో ఉన్న టెన్షన్ ను తీసేసారు : వరుణ్ తేజ్

వరుణ్ తేజ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన తాజా చిత్రం ‘గద్దలకొండ గణేష్’. పూజాహెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో అధర్వ మురళి కూడా మరో హీరోగా నటించాడు. వరుణ్ మాస్ అవతార్ ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయ్యింది. అయితే ‘గద్దలకొండ గణేష్’ రిలీజ్ కు ముందు వరుణ్ చాలా టెన్షన్ పడిపోయాడట. అంతేకాదు చాలా బయపడిపోయాడట కూడా. అయితే తన టెన్షన్ ను, భయాన్ని ‘ఆర్.ఆర్.ఆర్’ హీరోలైన చరణ్, ఎన్టీఆర్ లు తీసేసారట. అదెలాగో వరుణ్ మాటల్లోనే చూద్దాం రండి.

వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. “మా ‘గద్దల కొండ గణేష్‌’ సైన్మా ని ఇంత పెద్ద హిట్టు చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్‌. పూజ నా ఫస్ట్‌ హీరోయిన్‌. ఆమెతో కలిసి నటించడం చాలా హ్యాపీగా ఉంది. ‘గబ్బర్‌సింగ్‌’ చూశాక మా బాబాయ్‌కి అంత పెద్ద హిట్‌ ఇచ్చిన హరీష్‌ శంకర్‌ గారు నాకోసం కథ తీసుకువస్తారు అని ఎప్పుడూ అనుకోలేదు. నేను పర్సనల్‌గా కనెక్ట్‌ అయిందే ఎక్కడంటే మా ఇద్దరికి సినిమా తప్ప మరేదీ తెలీదు. ఆయన ఏదయినా సినిమా కోసమే చేస్తారు. మా ప్రొడ్యూసర్స్‌ రామ్‌ ఆచంట, గోపి ఆచంట నాతో రెండు సంవత్సరాలుగా ట్రావెల్‌ అవుతున్నారు. ఫుల్‌ సపోర్ట్‌ చేసారు. ఈ సినిమాలో హరీష్‌ రాసిన ”సినిమా డబ్బు, పేరు ఇస్తుంది అని విన్నా… కానీ ఇంత ప్రేమ ఇస్తుంది అనుకోలేదు’ అనే డైలాగ్‌ విని వెంటనే చిరంజీవి గారికి మెసేజ్‌ పెట్టాను. ‘మీరు మీ కష్టంతో ఇండస్ట్రీకి వచ్చారు. కానీ మా అందరికీ కూడా బంగారు బాట వేసినందుకు థాంక్స్‌’ అని. ఈ సినిమా రిలీజ్‌కి ముందు టైటిల్‌ మార్చాలి అన్నప్పుడు చరణ్‌ అన్నకి ఫోన్‌ చేశాను. ఇంటికి రా అన్నారు. వెళ్తే చరణ్‌ అన్న, తారక్‌ ఇద్దరు కలిసి కూర్చొని కాఫీ తాగుతున్నారు. ఆరోజు నాకున్న స్ట్రెస్‌ని జీరోకి తీసుకువచ్చింది వారిద్దరే. ఈ సందర్భంగా వారిద్దరికీ థాంక్స్‌. అలాగే ‘గద్దల కొండ గణేష్‌ ‘చిత్రాన్ని ఇంత పెద్ద సక్సెస్‌ చేసిన ఆడియన్స్‌కి ధన్యవాదాలు” అంటూ చెప్పుకొచ్చాడు.

గద్దలకొండ గణేష్ (వాల్మీకి) సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus