ఇంకో పదిరోజుల్లో క్లారిటీ ఇస్తానంటున్న త్రివిక్రమ్

ఎవ్వరూ ఊహించనివిధంగా ‘అజ్ణాతవాసి’ డిజాస్టర్ అవ్వడంతోపాటు నిర్మాతకు, డిస్ట్రిబ్యూటర్ కు, ఎగ్జిబిటర్ కూ భారీ నష్టం తీసుకురావడం తెలుగు చిత్రసీమనే కుదిపేసిన విషయం. అలాంటి డిజాస్టర్ అనంతరం త్రివిక్రమ్ శ్రీనివాస్ వరుస హిట్స్ తో దూసుకుపోతున్న ఎన్టీయార్ తో “అజ్ణాతవాసి” రిలీజ్ కి ముందు మొదలెట్టిన సినిమా సెట్స్ కు వెళుతుందో లేదో అనే అనుమానాలు రేకెత్తాయి. అయితే.. దర్శకుడిగా ఇప్పటివరకూ త్రివిక్రమ్ ఖాతాలో కమర్షియల్ ఫ్లాప్స్ ఉన్నప్పటికీ “చెత్త సినిమా తీశాడు” అని ప్రేక్షకులు ఎప్పుడూ తిట్టుకోలేదు. ఒక్క “అజ్ణాతవాసి” మాత్రమే ఆయన కెరీర్ లోనే భారీ పరాజయం. సో, ఒకే ఒక్క పరాజయంతో ఒక దర్శకుడి ప్రతిభను అంచనా వేయడం, తక్కువ చేసి చూడడం అనేది సబబు కాదు. అందుకే హారికా హాసిని సంస్థతోపాటు ఎన్టీయార్ కూడా త్రివిక్రమ్ మీద విశేషమైన నమ్మకంతో ముందు అనుకొన్న కథలో ఎలాంటి మార్పులు లేకుండా సినిమా మొదలెట్టానున్నారు.

మార్చి మూడోవారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందట. మరో పదిరోజుల్లో తారక్ సరసన నటించే కథానాయిక ఎవరు అనే విషయంతోపాటు మిగతా నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలను కూడా వెల్లడించనున్నారు. అయితే.. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రద్ధ కపూర్, పూజా హెగ్డేల పేరు వినబడుతున్నప్పటికీ.. ఎవరు ఫైనల్ అయ్యారు అనేది మాత్రం మార్చి మొదటివారం కల్లా తెలిసిపోతుంది. సో, డియర్ ఎన్టీయార్ ఫ్యాన్స్ సరిగ్గా ఒక పదిరోజులు ఆగితే అన్నీ వివరాలు వెల్లడవుతాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus