షూటింగ్ డేట్ పోస్టర్ రిలీజ్ చేసిన ఎన్టీఆర్, త్రివిక్రమ్ చిత్ర బృందం ?

  • January 6, 2018 / 06:59 AM IST

ఇప్పటివరకు మెగా హీరోలతో సినిమాలు చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ తొలిసారి నందమూరి హీరోతో సినిమా చేయబోతున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు చేయనున్న సినిమా లాంఛనంగా ప్రారంభమయిన సంగతి తెలిసింది. ప్రస్తుతం డైరక్టర్ పవన్ కళ్యాణ్ సినిమా అజ్ఞాతవాసి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండడంతో.. కాస్త బ్రేక్ ఇచ్చారు. ఎన్టీఆర్ తో సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ కి వెళుతుందా? అని చిత్ర బృందం కంటే అభిమానులకే ఎక్కువగా ఆత్రంగా ఉంది. అందుకే వారు ప్రీ లుక్ ని సిద్ధం చేసి రిలీజ్ చేశారు. ఈ లుక్ చూసి నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని అధినేత రాధా కృష్ణ కూడా ఆశ్చర్యపోయారంట. త్రివిక్రమ్ ఈ పోస్టర్ చూసి మొదట షాక్ తిన్నా.. తర్వాత ఫ్యాన్స్ ప్రతిభని మెచ్చుకోకుండా ఉండలేకపోయారని తెలిసింది.

అయితే ఎన్టీఆర్ సినిమా గురించి ఇప్పుడే ఎటువంటి పోస్టర్ రిలీజ్ చేసే ఉద్దేశం లేదని త్రివిక్రమ్ సన్నిహితులు చెప్పారు. ప్రస్తుతం ఎన్టీఆర్ స్లిమ్ కావడానికి హాలీవుడ్ ఫిట్ నెస్ నిపుణుల సలహా మేరకు డైట్ ఫాలో అవుతున్నారు. కుటుంబ కథతో తెరకెక్కనున్న ఈ సినిమాలో హీరోయిన్ గా అను ఇమ్యానుయేల్, పూజ హెగ్డే పేర్లు పరిశీలిస్తున్నారు. ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయితే సంగీత దర్శకుడిగా అజ్ఞాతవాసికి పనిచేసిన అనిరుధ్ నే సెలక్ట్ చేశారు. ఫిబ్రవరి నుంచి పట్టాలెక్కనున్న ఎన్టీఆర్ 28 వ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus