ముప్పై ఏళ్ల క్రితం హైదరాబాద్ ఫోటోని షేర్ చేసిన నాగార్జున

జూబ్లీహిల్స్.. బంజారాహిల్స్.. బంగారు కొండలుగా కాకముందు.. రాళ్లు రప్పలతో నిండి ఉండేది. చెన్నై నుంచి సినీ పరిశ్రమ హైదరాబాద్ కి తరలి వచ్చినప్పుడు జూబ్లీహిల్స్ ప్రాంతంలో విసిరిపారేసినట్టు అక్కడక్కడా ఇల్లు ఉండేవి. ఈ ప్రాంతంలో మనదర్శకులు కొన్ని సన్నివేశాలను తెరకెక్కించేవారు. ఆనాటి జూబ్లీహిల్స్ ప్రాంతాన్ని చాల తక్కువమంది మాత్రమే చూసారు. అందుకే ఆనాడు ఈ ఏరియా ఎలా ఉండేదో నాగార్జున ఓ ఫోటో ద్వారా చెప్పారు.

నేడు పోస్ట్ చేసిన ఫొటోలో ఒక పక్కా కేబీఆర్ పార్కు ప్రహారీ.. రెండో సైడ్ ఖాళీగా ఉన్న ప్రాంతం. (ఇక్కడే అన్నపూర్ణ స్టూడియో కట్టారు.) ఇక మధ్య కారులో లెజెండ్స్ అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి తారకరామారావు ఉన్నారు. ఆ ఫోటోను చూసిన నెటిజన్లు లైకులు కొడుతున్నారు. అప్పుడు జూబ్లీహిల్స్ ఇలా ఉండేదా? అని ఆశ్చర్యపోతున్నారు. ఇంకా కొంతమంది ఎన్టీఆర్, ఏఎన్నార్ అభిమానులు ఈ స్టిల్ ఏ సినిమాలోనిదా? అని ఆరా తీస్తున్నారు. సత్యం శివం, రామకృష్ణులు సినిమాలోది కావచ్చని అంచనా వేస్తున్నారు. అందుకు సరైన ఆన్సర్ నాగార్జునే చెప్పాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus