అన్నగారిని మరిపించిన బాలయ్య..!

  • December 21, 2018 / 02:17 PM IST

రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్ బయోపిక్ ట్రైలర్’ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం క్రిష్ డైరెక్షన్లో రూపుదిద్దుకుంది. ఈ ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచేసిందనే చెప్పాలి. . ఎన్టీఆర్ సినిమాల్లోకి రావడం దగ్గర్నుండీ రాజకీయాల్లోకి వెళ్ళడం వరకూ ప్రతీ అంశాన్ని వివరిస్తూ ఈ ట్రైలర్ ను అద్భుతంగా కట్ చేసారు. ఇక బసవతారకం, ఎన్టీఆర్ ల మధ్య వచ్చే సన్నివేశాలు కచ్చితంగా ఆకట్టుకునే విధంగానే ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య పలికిన డైలాగులు అభిమానులను కట్టి పడేస్తాయనే చెప్పాలి.

వీటిలో కొన్ని పరిశీలిస్తే :

”జనం కోసమే సినిమా అనుకున్నాను.. ఆ జనానికే అడ్డమైతే సినిమా కూడా వద్దంటాను..”

”60 ఏళ్లు వస్తున్నాయి.. ఇన్నాళ్లు మాకోసం బతికాం ఇక ప్రజల కోసం ప్రజాసేవలో బతకాలనుకుంటున్నాం”

”నన్ను దేవుడిని చేసిన మనుషుల కోసం నేను మళ్లీ మనిషిగా మారడానికి సిద్ధంగా ఉన్నాను”

”ధనబలం అయితే బలుపులో కనిపిస్తుంది. కానీ ఇది జనబలం ఒక్క పిలుపులో వినిపిస్తుంది”

నందమూరి బాలకృష్ణ ‘ఎన్.బి.కే ఫిలిమ్స్’ బ్యానర్ ను స్థాపించి తన 100 వ చిత్రం ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ వంటి మరుపురాని చిత్రాన్ని ఇచ్చిన క్రిష్ డైరెక్షన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాడు. సాయి కొర్రపాటి సహా నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్ర ఆడియో వేడుక జెఆర్సీ కన్వెన్షన్ లో అట్టహాసంగా జరిగింది.

నందమూరి కుటుంబ సభ్యులు మొత్తం ఈ ఫంక్షన్ కు హాజరయ్యారు.ఎన్టీఆర్ మొదటి భాగమైన ‘ఎన్టీఆర్ – కథానాయకుడు’ చిత్రాన్ని జనవరి 9న విడుదల చేయబోతుండగా… ‘ఎన్టీఆర్ – మహానాయకుడు’ ఫిబ్రవరి 7న విడుదల చేయనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus