అభిమానుల కోసం పెద్ద రిస్క్ చేసిన జూనియర్ ఎన్టీఆర్..!

ప్రముఖ సినీనటులు జూనియర్‌ ఎన్టీ రామారావు, నందమూరి హరికృష్ణలు శుక్రవారం రాజమహేంద్రవరంలో సందడి చేశారు. శనివారం సాయంత్రం దివంగత నందమూరి జానకీరామ్‌ కుమారులు, ప్రముఖ ల్యాండ్‌లార్డ్‌ యార్లగడ్డ ప్రభాకరచౌదరిల మనుమలకు పంచెకట్టు కార్యక్రమం జరుగనున్న నేపథ్యంలో.. కాకినాడ సర్పవరంలో మాజీ ఎంపీ చుండ్రు శ్రీహరి ఇంట్లో జరిగే వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. కాకినాడ నగరంలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు కూడా పెట్టారు.

భారీ ఎత్తు అభిమానులు తరలిరావడంతో కాకినాడ– పిఠాపురం రోడ్డులో ట్రాఫిక్‌ స్తంభించింది. అయితే.. అభిమానుల కోసం పెద్ద జూనియర్ ఎన్టీఆర్ చేసిన ఓ రిస్క్ ఇప్పుడు విలుగులోకి వచ్చింది. అభిమానుల కోరిక మేరకు ఎన్టీఆర్ పెద్ద గోడ పైకి ఎక్కి చేతులు ఊపారు. అయితే.. అభిమానుల కోసం ఎన్టీఆర్ అంత పెద్ద గోడ ఎక్కడంతో అతని సెక్యూరిటీ అంతా ఆందోళనకు గురి అయ్యారు. గోడ పైకి ఎక్కి చేతులు ఊపి.. ఆతరువాత దిగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus